రాజకీయంగా బలహీనపడుతున్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఇసుక ద్వారా బలపడాలని భావిస్తూ రాజకీయం చేస్తుంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇసుకో రామచంద్రా అంటూ ఉద్యమాలు, నిరసనలు ఎక్కువగా చేస్తున్నారు. పార్టీ క్యాడర్ ని కూడా ఇసుక మీద పోరాటం చేయమని నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తెలుగుదేశం నేతలు మైక్ దొరకడం ఆలస్యం ఇసుక గురించి మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే కొందరిలో నీరసం వచ్చేస్తుంది. ఇంకెన్నాళ్ళు ఆ పోరాటం అంటూ పార్టీ నాయకులు అసహనంగా ఉన్నారు.


ఈ నెల 14 న చంద్రబాబు విజయవాడలో నిరాహార దీక్ష చేయనున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఆయన ఈ దీక్షలో కూర్చోనున్నారు. ఇందుకు ఇందిరా గాంధీ స్టేడియంలో అనుమతి ఇవ్వడానికి విజయవాడ మున్సిపల్ కమిషనర్ అంగీకరించలేదు. దీనితో ధర్నా చౌక్ లో దీక్ష చెయ్యాలని భావిస్తున్నారు. ఈ స‌మ‌యంలో కొందరు నేతలు పార్టీ మారేందుకు సిద్దమవుతున్నారు అనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది.


గుంటూరు జిల్లాకు చెందిన ఒక సీనియర్ నేత, మాజీ మంత్రి పసుపు జెండా వదిలి రావడానికి సిద్దంగా ఉన్నారని, ఆయన జగన్ సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకునే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇక ఆయనతో పాటు కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, ఒక మాజీ మంత్రి వైసీపీలోకి వెళ్ళే అవకాశం ఉంది, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కూడా అదే రోజు మారే అవకాశం ఉంది.


ఇక చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు నుంచి కూడా నేతలు పార్టీ మారే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. వారిలో ఒక మాజీ మంత్రి, మాజీ ఎంపీ ఉన్నారట... ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా మారే అవకాశం ఉందని అంటున్నారు. ఏదేమైనా చంద్ర‌బాబు ఇటు దీక్ష చేసే రోజునే ఆయ‌న‌కు షాక్ ఇచ్చేందుకు టీడీపీ నేత‌లు సిద్ధంగా ఉన్నార‌న్న ప్ర‌చారం మాత్రం టీడీపీ వ‌ర్గాల్లోనే జోరుగా న‌డుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: