సీఎం రమేష్, నిన్నటి తెలుగు తమ్ముడు. ఈ ఏడాది జూన్ లో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఉన్న రమేష్ తెలుగుదేశం పార్టీలో రెండు సార్లు రాజ్యసభ సభ్యునిగా ఎంపిక అయ్యారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన రమేష్ బీజేపీకి చేరక ముందు ఆదాయపన్ను శాఖ దాడుల నుంచి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఇక బీజేపీలో ఆయన చేరాక కూడా చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ వచ్చారు

 

ఇపుడు హఠాత్తుగా రమేష్ తన కుమారుడు రిత్విక్ ఎంగేంజ్మెంట్ ని దుబాయ్ లో ఈ రోజు నిర్వహిస్తున్నారు. దీనికి దాదాపుగా వంద మంది వరకూ ఎంపీలు వివిధ పార్టీలకు చెందిన వారు వెళ్తారని అంటున్నారు ఇక రమేష్ వీవీఐల కోసం 15 కి పైగా  ప్రత్యేక విమానాలు కూడా ఢిల్లీ నుంచి దుబాయ్ కి ఏర్పాటు చేసినట్లుగా కూడా చెబుతున్నారు.

 

ఇదిలా ఉండగా ప్రముఖ పారిశ్రామికవేత్త రాజా తాళ్ళూరి కుమార్తె  పూజ‌తో రిత్విక్ ఎంగేజ్మెంట్ జరుగుతోందని సమాచారం. అన్ని పార్టీలకు చెందిన బిగ్ షాట్స్, వివిధ రంగాల ప్రముఖులు కూడా ఈ వేడుకలకు వెళ్తున్నారు. ఈ రోజు జరిగే ఈ ఎంగేజ్మెంట్ కి అదిరిపోయే ఏర్పాట్లు సీఎం రమేష్ చేశాడని అంటున్నారు. మొత్తం మీద పాతిక కోట్లకు పైగా ఖర్చుని కేవలం ఎంగేజ్మెంట్ కోసేమే ఖర్చు పెడుతున్నట్లుగా చెబుతున్నారు. 

 

ఇది కేవలం ఎంగేజ్మెంట్. దానికే పాతిక కోట్ల వరకూ ఖర్చు పెడుతున్నట్లుగా ప్రచారం సాగుతోందంటే ఇక పెళ్ళికి ఎన్ని వందల కోట్లు ఖర్చు చేస్తారో చూడాలి. మొత్తానికి సీఎం రమేష్ ఇంట కళ్యాణం  రాజకీయ నేతలందరికీ వైభోగంగా మారిందని అంటున్నారు ఇక ఈ ఎంగేజ్మెంట్ కి విశాఖ నుంచి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు, వైసీపీకి చెందిన ఎంపీ మిధున్ రెడ్డి తదితరులు హాజరవుతున్నట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: