ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే దాదాపు 75 శాతం ఉద్యోగాలు లోకల్ వాళ్లకి వచ్చే విధంగా చట్టం తీసుకు వస్తాను అంటూ హామీ ఇవ్వడం జరిగింది. అదే సమయంలో తర్వాత ఎన్నికలు రావడంతో ముఖ్యమంత్రి అయిన జగన్ వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రైవేట్ కంపెనీ అయినా కచ్చితంగా ఆంధ్రా వాళ్లకి 75% అందులో లోకల్ వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలని చట్టం తీసుకు వచ్చారు. దీంతో జగన్ తీసుకొచ్చిన ఈ చట్టంపై దేశవ్యాప్తంగా తో పాటు ఆంధ్రప్రదేశ్ చుట్టు పక్క రాష్ట్రాల్లో కూడా విమర్శలు వచ్చాయి. అలాగే అయితే ఎవరికి వారు తమ రాష్ట్రానికి చెందిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకుంటూ పోతే ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టినట్లు అవుతుందని జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అప్పట్లో విమర్శలు రావడం జరిగింది.

 

ఇదిలా ఉండగా తాజాగా కర్ణాటక రాష్ట్రంలో కన్నడిలు..తమ రాష్ట్రానికి చెందిన వాళ్లకి ఉద్యోగాలు ఇవ్వాలని బందూకు పిలుపునిచ్చాయి. ఈ బంద్ పలుచోట్ల తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. బందులో పాల్గొన్న కన్నడ రాష్ట్రానికి చెందిన వాలు ఆంధ్ర బస్సు లను టార్గెట్ చేస్తూ రాళ్లు విసిరారు. మంగళూరు సమీపంలో ఆంధ్ర టూరిజం కార్పొరేషన్ కి చెందిన బస్సుపై నిరసనకారులు ఒక్కసారిగా రాళ్లు విసరడంతో ఏపీ నుంచి విహారయాత్రకు వెళ్లిన పర్యాటకులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు.

 

కర్ణాటక రాష్ట్రం నుంచి తిరుపతి కి వస్తున్నా మరో ఆంధ్ర బస్సుపై ఈ తరహాలోనే దాడులు జరిగాయి. దాదాపు 100కు పైగా కన్నడ సంఘాలు విద్యార్థి సంఘాలు ఈ బంద్ లో పాల్గొనడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఇటీవల కొన్ని రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో జాతీయ పార్టీలు అయినా బీజేపీ, కాంగ్రెస్ నేతలు.. ఈ చట్టం తీసుకొస్తామని స్థానికులకే ఉద్యోగాలిస్తామని ఎన్నికల హామీలు ఇచ్చారు. దీంతో ఈ గొడవల పై సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ విధంగా కామెంట్ చేశారు..వీరందరికీ జగన్ మోహన్ రెడ్డే ఆదర్శం అన్నట్టుగా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: