ట్రంప్.. అమెరికా అధ్యక్షుడు.. ఆయన డాబూ, దర్పం మాములుగా ఉండవు. ఆయన ఎక్కడకు కదిలితే అక్కడకు ఆయన సమస్తపరివారం కదలి రావాల్సిందే. ఆయన ప్రయాణించే వాహనాలు సైతం అమెరికా నుంచే వస్తాయి. ఇక ట్రంప్ కారు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే వాహనం.. ప్రపంచంలోనే అత్యంత శత్రుదుర్బేధ్యందంటే అతిశయోక్తి కాదు.

 

ట్రంప్ వాహనం పేరు ద బీస్ట్. ట్రంప్ ఏ దేశానికి వెళ్లినా ఈ వాహనాన్ని ఆ దేశానికి చేరుస్తారు. ఎందుకంటే ఎలాంటి దాడులనైనా తట్టుకునే సామర్ధ్యం ఈ కారు సొంతం. బుల్లెట్ ప్రూఫ్ సౌకర్యం ఉంది. అంతే కాదు.. అనేక విలాసవంతమైన సౌకర్యాలు ఆ కారులో ఉన్నాయి. ఇది భద్రతాపరంగా ఎంత శత్రుదుర్బేధ్యమైందో.. సౌకర్యాలపరంగా అంత విలాసవంతం. ఈ కారును తయారు చేసింది ఏ కంపెనీయో తెలుసా..

 

IHG

 

 

ప్రఖ్యాత జనరల్ మోటర్స్ అనుబంధ సంస్థ క్యాడిలాక్ అధ్యక్షుడికి మాత్రమే పరిమితమైన ఈ ప్రత్యేక కారును తయారు చేసింది. ట్రంప్ రాకకుముందే ప్రత్యేక విమానంలో దీన్ని గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చేర్చారు. ట్రంప్ ప్రయాణించే బీస్ట్ కారుకు బోయింగ్ 757 విమానానికి ఉండే డోర్లు వంటివి ఉంటాయి. ఎందుకంటే వాటిలో ఆయుధాలు అమర్చి ఉంటాయి. ఈ బీస్ట్ కారు అద్దాలు ఎంతో ధృడమైనవి. ఐదు లేయర్ల గ్లాస్, పోలీకార్బోనెట్‌తో ఈ అద్దాలు రూపొందిస్తారు. గ్యాస్, రసాయనాలు లోపలకు వెళ్లలేనంత పటిష్ఠంగా ఉంటాయి. ఇవి ఎలాంటి బుల్లెట్ దాడినైనా తట్టుకోగలవు.

 

ఈ బీస్ట్ లో డ్రైవర్ విండో కేవలం 3 అంగులాలే తెరుచుకుంటుంది. అంతే కాదు.. ఈ కారు డోర్‌ను ప్రెసిడెంట్ ట్రంప్, ఆయన కారు డ్రైవర్ మాత్రమే తెరవగలుగుతారు. ఈ బీస్ట్‌ కార్ శక్తివంతమైన ఆయుధాలు, టీయర్ గ్యాస్ దాడులను కూడా తట్టుకుంటుంది. ఇక డ్రైవర్ క్యాబిన్ లో హైటెక్నాలజీ డివైసెస్ ఉంటాయి. జీపీఎస్ ట్రాకింగ్ కూడా ఉటుంది. ట్రంప్ ఎటు కదలినా ఆ కదలికలు అమెరికా నిఘా విభాగానికి చేరిపోతాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: