మొన్న విశాఖలో టీడీపీ అధినేతకు ఎలాంటి పరిస్థితి ఎదురైందో లోకమంతా చూసింది. అబ్బే ఆ దాడి చేసింది వైసీపీయే.. వాళ్లంతా పెయిడ్ ఆర్టిస్టులు అని టీడీపీ నేతలు ఎంతైనా సమర్థించుకోవచ్చు గాక.. కానీ.. ఆ అవకాశం ఇచ్చింది మాత్రం చంద్రబాబే కదా.. అయితే ఈ పరాభవం విశాఖకే పరిమితం అవుతుందా.. ఇంకా మిగిలిన ప్రాంతాలకు పాకుతుందా.. చంద్రబాబు పర్యటనలకు ఇకపై ఇలాంటి ఇబ్బందులు తలెత్తనున్నాయా.. ?

 

 

ఇప్పుడు ఈ చర్చ నడుస్తోంది. ఎందుకంటే.. విశాఖకు ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ వ్యతిరేకిస్తూ చంద్రబాబు నోటి దూలతో చేసిన ప్రకటనతో ఆగ్రహంతో ఉత్తరాంధ్ర ప్రజలు బాబు పర్యటనను అడ్డుకున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణను అడ్డుకున్న చంద్రబాబు రాయలసీమకు వెళ్లినా.. చివరకు కుప్పం నియోజకవర్గం వెళ్లినా విశాఖ సీన్‌ రిపీట్‌ అవుతుందని వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు వార్నింగ్ ఇచ్చారు. చివరకు 40 ఏళ్ల చంద్రబాబు అనుభవం మూడు గ్రామాలకు పరిమితమైందన్నారు.

 

 

అంతే కాదు.. చంద్రబాబు తన రాజకీయ సమాధిని తానే కట్టుకున్నాడని వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు ఎద్దేవా చేశారు. అమరావతి బహుజన ప్రాంతంగా ఉండాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఇళ్ల స్థలాల పంపిణీ కోసం సీఎం వైయస్‌ జగన్‌ 1251 ఎకరాలు కేటాయిస్తే దాన్ని కూడా చంద్రబాబు వ్యతిరేకిస్తున్నాడని, నిరుపేదలకు స్థలాలు ఇస్తే ఎందుకంత కడుపుమంట అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చరిత్రకారుడిగా నిలిచిపోతాడని విమర్శించారు.

 

 

అంతేకాదు.. రాజధాని ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సుమారు 54 వేల మందికి ఇళ్ల స్థలాల కోసం 1251 ఎకరాలు కేటాయిస్తే ఆహ్వానించాల్సింది పోయి.. జనాభాలో సమతూల్యత లోపించిందని ప్రచారం చేస్తున్నాడని సుధాకర్ బాబు విమర్శించారు. అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉండకూడదా.. ఇదేనా నీ రాజనీతి, నీ అనుభవం. రాజధాని ప్రాంత భూములను అన్నీ బినామీ కంపెనీలకు కట్టబెట్టాడని మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే.

మరింత సమాచారం తెలుసుకోండి: