ఆంధ్రప్రదేశ్ లో బలహీనంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు రాజకీయంగా బలపడటానికి ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా సరే ఫలితం మాత్రం ఉండటం లేదనే వ్యాఖ్యలు ఆ పార్టీ నేతలే నుంచే ఎక్కువగా వినపడుతున్నాయి. సోషల్ మీడియాలో, ప్రధాన మీడియా లో చంద్రబాబు అనుకూల మీడియా టీడీపీ కార్యకర్తలు ఆ పార్టీని ఎన్ని విధాలుగా లేపే ప్రయత్నాలు చేసినా సరే పార్టీ మాత్రం బలపడే సూచనలు ఇప్పట్లో కనపడటం లేదనే చెప్పాలి. దీనికి ప్రధాన కారణం నాయకత్వ సమస్యే అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. 

 

చంద్రబాబుకి ఎంత సామర్ధ్యం ఉన్నా సరే ఆయన ఇప్పుడు 70 ఏళ్ళ వయసులో ఉన్నారు. రాజకీయంగా ఆయన ఆలోచనలు కూడా ఇప్పుడు యువతకు దగ్గరయ్యే విధంగా లేవు అనే చెప్పాలి. తన ముతక సిద్దాంతాలతో పార్టీని ముందుకి నడిపిస్తున్నారు అనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. రాజకీయంగా ఆ పార్టీని లోకేష్ ముందుకి తీసుకువెళ్ళే అవకాశాలు కనపడటం లేదు. అయితే కొందరు నేతలు ఇప్పుడు ఆయన మాట వినే పరిస్థితి కనపడటం లేదని పార్టీ నేతలు అంటున్నారు. ఆయన ఎన్ని విధాలుగా చెప్పినా సరే చాలా మంది నేతలు వినే పరిస్థితిలో లేరు. 

 

ఎవరికి తోచింది వాళ్ళు చేస్తున్నారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసినా కూడా ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళు చేస్తున్నారు అనే ఆరోపణలు వినపడుతున్నాయి. కేంద్రాన్ని బ్రతిమిలాడుకునే పరిస్థితుల్లో ఉన్న సమయంలో కేంద్రం తో యుద్ధం చేస్తున్నరు కేసినేని నానీ. ఈ ఎంపీ గారి తీరు చికాకుగా మైరంది. ఒక పక్క కృష్ణా జిల్లాలో పార్టీ దేవినేని ఉమా వలన ఇబ్బంది పడింది అని తెలిసినా సరే ఆయన మాత్రం మారడం లేదు. ఆధిపత్యం ధోరణి తో ముందుకి వెళ్ళడం కూడా పార్టీకి చికాకుగా మారింది అనే చెప్పాలి. ఇలా ఒక్కరు కూడా చంద్రబాబు మాట వినే పరిస్థితిలో లేరు.

మరింత సమాచారం తెలుసుకోండి: