కరోనా వైరస్ కారణంగా ప్రపంచ దేశాలు విలవిల్లాడుతున్నాయి. అందుకు తగిన మెడిసిన్  నిలువలు లేక ప్రపంచ దేశాలు ఇతర దేశాల సహాయాన్ని  అర్ధిస్తున్నాను. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  హైడ్రోక్సీక్లోరోక్విన్  మందుల కోసం ఇండియాను మరియు ఇతర దేశాలను బెదిరించిన విషయం తెలిసిందే. ఆపై ఇండియా నుంచి హైడ్రోక్సీక్లోరోక్విన్  మందులు పంపించినప్పుడు ట్రంప్ ఎంతో ఉదార భావంతో కృతజ్ఞతలు చెప్పిన విషయం తెలిసిందే. మన ఇండియా కు ఒక అమెరికా కేకాదు  అమెరికాతో పాటు బ్రెజిల్ మరియు ఇతర దేశాలకు కూడా ఈ మందును సరఫరా చేయడం జరిగింది.

 

 అదేవిధంగా ఇజ్రాయిల్ దేశానికి హైడ్రోక్సీక్లోరోక్విన్ పంపించడం జరిగింది ప్రత్యేకంగా ఆ దేశపు ప్రధాని  బెంజిమెన్  నేతన్యాహు  మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది అంతేకాకుండా భారత ప్రధాని నా ఆప్త  మిత్రుడు అని పొగడ్తలతో ముంచెత్తాడు. ఇండియా నుంచి ఇజ్రాయెల్ కు ఎయిర్ ఇండియా విమానం  మంగళవారం నాడు ఇజ్రాయెల్ కు చేరింది. దాదాపు ఐదు టన్నుల మందులను అందించడం జరిగింది ఇజ్రాయిల్ లో ఇప్పటి వరకూ 10,000 మందికి పైగా కరోనా వైరస్ బారిన పడ్డారు వీరిలో 80  మంది మృత్యువాత పడగా 121 మంది ఐసీయూలో ఉన్నట్టుగా సమాచారం

మరింత సమాచారం తెలుసుకోండి: