కరోనా వైరస్ కట్టడి చేయడానికి ప్రపంచ దేశాలు ముప్పుతిప్పలు పడుతున్నాయి. ఈ వైరస్ వల్ల చాలా దేశాల ప్రధానులు తమ ప్రజలను కాపాడుకోవడానికి లాక్ డౌన్ నీ ప్రకటించాయి. మందులేని ఈ వైరస్ మహమ్మారిని ఎదుర్కోవాలంటే నియంత్రణ ఒకటే మార్గమని ప్రపంచంలో చాలా వరకు దేశాలు అన్ని లాక్ డౌన్ నీ ప్రకటించాయి. ఈ వైరస్ కి వ్యాక్సిన్ లేకపోవటంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రపంచంలో ఉన్న ప్రజలు. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో భారత సంతతికి చెందిన 98 ఏళ్ల ముసలవ్వ సంచలనం సృష్టించింది. కరోనా వైరస్ బారిన పడిన నాలుగు రోజుల్లోనే కోలుకొని అంతర్జాతీయ వార్తల్లో నిలిచింది. స్కాట్లాండ్ దేశానికి చెందిన ఈమె పేరు డఫ్నే షా. రాబోయే జూలై మాసంలో 99వ వసంతంలోకి అడుగు పెట్టబోతోంది.

 

కేరళ లో కుర్చీ లో జన్మించిన ఈమెలో నాలుగు రోజుల క్రితం కరోనా లక్షణాలు బయట పడటంతో కుటుంబ సభ్యులు ఆమెను హాస్పిటల్ కి తీసుకు వచ్చారు. దగ్గు విపరీతమైన జ్వరం శ్వాసలో ఇబ్బందులు రావడంతో ఉష్ణోగ్రత ఒక్కసారిగా పెరిగిపోవడంతో వెంటనే కుటుంబ సభ్యులు గుర్తించి హాస్పిటల్ కి చేర్చారు. దీంతో ఆమెను పరీక్షించిన వైద్యులు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారించారు. మామూలుగా అయితే 60 ఏళ్ల వయసు పైబడిన వాళ్లు కి కరోనా వైరస్ సోకితే కచ్చితంగా మరణం సంభవిస్తుందని అందరూ భావించి ఈమె వయసుని దృష్టిలో పెట్టుకొని వైద్యులు అయిపోయింది  ఈమె పని అని అనుకున్నారు.

 

కానీ కేవ‌లం నాలుగు రోజుల్లోనే ఆమె కోలుకోవ‌డంతో అక్క‌డ వైద్యులు నోరెళ్ల‌బెట్టాల్సి వ‌చ్చింది. ఇక దీంతో ఆమెను ఇంటికి పంపించారు. తన బాగోగులను ఇప్పుడు తన కుమారుడు చూసుకుంటున్నాడని డఫ్నే వెల్ల‌డించింది. వైరస్ అంటే పెద్దగా భయపడాల్సిన అవసరం ఏమీ లేదని… ఆత్మవిశ్వాసంతో ఉండాలని అందుకే వైరస్ ని జయించి బయట ప్రపంచానికి వచ్చానని తెలిపింది. దీంతో అంతర్జాతీయ మీడియా అంతా డఫ్నే షా నిఆదర్శంగా తీసుకోవాలని ఆమెలా మనస్తత్వం ఉంటే కరోనా లేదు ఏమీ లేదు అంటూ చెప్పుకొచ్చింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: