క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని ప‌ట్టిపీడిస్తున్న వేళ ఇదే అంశంపై  మావోయిస్టులు తాజాగా విడుద‌ల చేసిన లేఖ‌పై విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. లేఖ‌లో పేర్కొన్న ఒక‌ట్రెండు అంశాల‌ను ప్ర‌ముఖ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ సాయి తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. ఈమేర‌కు ఆయ‌న త‌న అభిప్రాయాల‌ను ఆయ‌న యూట్యూబ్ చాన‌ల్ ద్వారా త‌న ఫాలోవ‌ర్స్‌తో పంచుకున్నారు. క‌రోనా వైర‌స్ దేశంలో వేగంగా ప్ర‌బ‌లుతున్న వేళ భార‌త ప్ర‌భుత్వం తీసుకోవాల్సిన చ‌ర్య‌లు, కేంద్ర‌, రాష్ట్రాల ప్ర‌భుత్వాలు అనుస‌రించాల్సిన విధానాల‌పై మావోయిస్టు పార్టీ కొన్ని కీల‌క‌మైన సూచ‌న‌లు చేసింది. అయితే క‌రోనా వైర‌స్ సామ్రాజ్య‌వాదం సృష్టేనంటూ పేర్కొన‌డంపై జర్న‌లిస్టు సాయి అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.

 

వైర‌స్ పుట్టింది చైనాలోన‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్న వేళ మావోయిస్టు పార్టీ లేఖ‌లో అర్థ‌ర‌హిత వాద‌న‌ను వినిపంచ‌డం స‌రికాద‌ని దుయ్య‌బ‌ట్టారు. క‌మ్యూనిజం పాల‌న‌లో కొన‌సాగుతున్న చైనాలో సామ్రాజ్య‌వాదం ఎక్క‌డుంటుంది..అంటూ ప్ర‌శ్న‌లు సంధించారు. ఇలాంటి అర్థం ప‌ర్థంలేని ప్ర‌క‌ట‌న‌ల‌తో మావోయిస్టు పార్టీ ప‌ల‌చ‌బ‌డిపోతోంద‌న్న అభిప్రాయాన్ని ఆయ‌న వీడిలో ద్వారా వ్య‌క్తం చేశారు. పైగా ప్ర‌జ‌ల‌కు, సామాన్య జ‌నానికి, నేటి త‌రానికి అర్థ‌మ‌య్యే భాషను ఉప‌యోగించ‌డంలో మావోయిస్టు పార్టీ విఫ‌ల‌మ‌వుతోంద‌ని తెలిపారు. సామ్రాజ్య‌వాదం అన్న ప‌దం..ముందు నేటిత‌రానికి అర్థ‌మే కాద‌ని అన్నారు.


మారుతున్న ప‌రిస్థితుల‌కు అనుగుణంగా మ‌వోయిస్టు పార్టీ విధానాల్లో మార్పులు జ‌ర‌గ‌డం లేద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. ఒక‌ప్పుడు మావోయిస్టు పార్టీలో ఉన్న సైద్ధాంతిక‌త ప్ర‌స్తుతం లోపించిన‌ట్లు క‌న‌బ‌డుతోంద‌ని త‌ప్పుబ‌ట్టారు. అంతేకాదు అప్పుడున్న విలువలు ఇప్పుడు..లేవ‌ని, ఏదో సందేశం ఇవ్వాల‌న్న ధోర‌ణితో..ఇలాంటి అర్థంప‌ర్థం లేని భాష‌తో..అర్థ‌ర‌హితంగా త‌యార‌వుతోంద‌న్న అభిప్రాయ‌న్ని వెల్ల‌డించారు. ఇదిలా ఉండ‌గా సాయి వ్యాఖ్య‌లు సంచల‌నంగా మారాయి. మావోయిస్టు పార్టీ  అభిమానుల్లోనూ..ఇటు మేధావుల్లోనూ కొత్త చ‌ర్చ‌కు దారితీస్తుండ‌టం గ‌మ‌నార్హం. చూడాలి ఈ విష‌యంలో ఇంకా ఏం జ‌రుగుతుందో..?!

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: