మరో నాలుగు రోజుల్లో దేశ వ్యాప్తంగా విధించిన రెండో దేశ లాక్ డౌన్ గడువు ముగియనుంది. అయితే ఈ లాక్ డౌన్ లో కూడా కరోనా ప్రభావం ఏ మాత్రం తగ్గకపోవడంతో మే 3 తరువాత మరోసారి లాక్ డౌన్ ను పొడిగించనున్నారని వార్తలు వస్తున్నాయి. తాజాగా కేంద్ర హోం  శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి  కూడా ఈవిషయాన్నే స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే లాక్ డౌన్ ను  మరో సారి పొడిగించక తప్పదని కేంద్రం కూడా అదే ఆలోచనలో ఉన్నట్లు  కిషన్ రెడ్డి వెల్లడించాడు. అయితే గ్రీన్ జోన్ల లో పూర్తిగా ఎత్తివేసే అంశాన్ని కూడా కేంద్రం పరిశీలిస్తుందని అన్నారు. ఇక చాలా రాష్ట్రాలు కరోనా కట్టడికి  కృషి చేస్తున్నాయి. కరోనా ను అరికట్టాలంటే లాక్ డౌన్ ఒక్కటే మార్గం అందుకే రెడ్ , ఆరెంజ్ జోన్లలో మరి కొన్ని రోజులు కఠినమైన లాక్ డౌన్ కొనసాగుతుందని ఆయన తెలిపారు. 
 
 
ఇక ప్రజా రవాణా గురించి కూడా స్పందించిన కిషన్ రెడ్డి ఇప్పట్లో విమానాలు , రైళ్లు , బస్సులు తిరగవని స్పష్టం చేశారు. అయితే వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు అలాగే  విదేశాల్లో వున్నా విద్యార్థులను  కూడా ఇండియా కు రప్పించేందుకు ప్రయత్నాలు  జరుగుతున్నాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇదిలావుంటే లాక్ డౌన్ వల్ల వేరే రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలను ,విద్యార్థులను , పర్యాటకులను సొంత రాష్ట్రాలకు తీసుకెళ్లేందుకు  కొద్దీ  సేపటి క్రితం కేంద్రం ఓకే చెప్పింది. అయితే వారికి టెస్టులు చేసి నెగిటివ్ వస్తే పంపించాలని అలాగే ఇందుకోసం కేవలం బస్సులను మాత్రమే వాడుకోవాలని సూచించింది. కాగా మే 2న జాతినుద్దేశించి ప్రధాన మంత్రి మోదీ మరోసారి ప్రసంగించనున్నారని ఆరోజే లాక్ డౌన్ గురించి కీలక ప్రకటన చేయనున్నారని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: