వైరాస్ అంటే ఇపుడు అందరికీ భయం పట్టుకుంటోంది. ఎందుకంటే ముంగిట్లో కరోనా వైరస్ పొంచి ఉంది. అది విశ్వం మొత్తం అంతు చూస్తోంది. పేద, గొప్పా తేడా లేకుండా ఏకంగా జీవితానికే చిచ్చు పెడుతోంది. ఎక్కడో పుట్టి మొత్తానికి విశ్వరూపం చూపిస్తూ తనకు అడూ అదుపూ లేదని చాటి చెబుతోంది. తన దూకుడుని చూపిస్తూ మొత్తం 800 కోట్ల మంది విశ్వజనులను హడలుకొట్టేస్తోంది.

అయితే ఇపుడు కరోనా మహమ్మారి ఒక శాంపిల్ మాత్రమేనని శాస్త్రవేత్తలు, పరిశోధకులు చావు కబురు చల్లగా చెబుతున్నారు. కరోనా ఆరంభం మాత్రమేనట. దానికి మించిన వైరసులు రెడీ అవుతున్నాయట. అవి సమయం చూసుకుని మానవాళి మీద దాడి చేస్తాయట. అవి ఒకటీ రెండూ కాదు, ఏకంగా లక్షల్లో వస్తాయట. సైంటిస్టుల అంచనాల ప్రకారం చూసుకుంటే 18 నుంచి 20 లక్షల వరకూ వైరస్ లో ఈ భూగోళం అంతా నిండి ఉన్నాయట.

 

అవి గాలిలో నీరులో, పక్షుల్లో , పశువుల్లో, అక్కుల్లో, చెట్లలో, ప్రక్తుతిలో, జంతువుల్లో నిండిపోయి ఉంటాయట. వీటి దాడిని తట్టుకోవడం కరోనా వైరస్ కంటే కూడా కష్టమని అంటున్నారు. ఓ విధంగా కరోనావే బెటర్ అంటున్నారు. ఇవి మరింత ప్రాణాంతకమైనవిట. వీటి వల్ల మరణమే తప్ప నియంత్రణ ఉండదని కూడా హెచ్చరిస్తున్నారు.

 

ప్రముఖ పరిశోధకులు ప్రొఫెసర్ జోసెఫ్ సెటెల్లే, ప్రొఫెసర్ శాండ్రా డియాజ్, ప్రొఫెసర్ ఎడ్వర్డో బ్రాండీజియో, డాక్టర్ పీటర్ డాస్జాక్ ఓ అధ్యయనంలో ఈ వివరాలను పంచుకున్నారు. రానున్న రోజుల్లో వైరసులు మానవాళి మీద పెద్ద ఎత్తున దాడి చేస్తాయని వారు  అంటున్నారు. దీనికి కారణం మానవ జీవన విధానమేనని కూడా తేల్చిచెబుతున్నారు. 

 

మనం ప్రక్రుతిని సర్వనాశనం చేశాం, వాటి ఫలితాలే ఇపుడు అందరూ అనుభవిస్తున్నారు అని కూడా అంటున్నారు. అడవులు పెద్ద సంఖ్యలో లేవు. చెట్లు లేవు, జంతువులు, కొన్ని రకాల పక్షులు కూడా లేవు. అందువల్లనే ఇపుడు కరోనా మహమ్మారి వచ్చింది. మరిన్ని వైరసులు కూడా వస్తాయని అంటున్నారు. మొత్తానికి భయపెడుతున్నారు. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. మరి మనిషి మారుతాడా. లేకపోతే మానవాళి సర్వనాశనం అవుతుంది ఇది ఖాయమని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: