భారత దేశంలో మార్చి నెలలో కరోనా కేసులు ఎక్కువగా పెరిగిపోతున్నాయని దేశమంతా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. మొదట కేరళాలో కరోనా పాజిటీవ్ కేసు ఇటలీ దేశస్తుడి నుంచి వచ్చిందని అన్నారు. ఆ తర్వాత వరుసగా అన్ని రాష్ట్రాల్లో ఈ కేసులు నమోదు కావం మొదలయ్యాయి. మొదల విదేశీయుల నుంచే ఈ కరోనా వచ్చిన తర్వాత దీని ప్రభావం లోకల్ గా మొదలైంది.  ఇలా దేశ వ్యాప్తంగా కరోనా విజృంభించింది. లాక్ డౌన్ కారంగాణ వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులు ఎన్ని కష్టాలు పడ్డారో ఆ దేవుడికే తెలియాలి.  మొన్నటి వరకు  జనసాంద్రత అధికంగా ఉన్న నగరాలు, పట్టణాల్లోనే ప్రతాపం చూపించిన కొవిడ్‌-19 ఇప్పుడు గ్రామసీమలను కమ్ముకుంటున్నది. 

IHG

ఎప్పుడైతే వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిందో.. అప్పటి నుంచి ఈ కొవిడ్‌-19  పల్లెప్రాంతాలపై ప్రభావాన్ని చూపించడం మొదలు పెట్టింది. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి సొంతూర్లకు చేరుతున్న వలస కూలీలు కరోనాను కూడావెంట తీసుకెళ్తున్నారు. దాంతో మొన్నటి వరకు సురక్షితమూ అని భావించిన పల్లెల్లో ఇప్పుడు స్మశాన నిశ్శబ్దం రాజ్యమేలుతున్నది. కలో గంజో తాగి కాలమీడుద్ధామనుకున్న పల్లె జనాలు కరోనాతో కకావికలమవుతున్నారు. గత పదిహేను రోజుల క్రితం దేశంలో కరోనా కేసులు వందలు దాటి వేలల్లోకి చేరుకున్నాయి.

IHG

ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్‌ కూడా ఒకటిగా నిలుస్తున్నది. క్‌డౌన్‌ సడలింపులతో నగరాల నుంచి లక్షల మంది వలస కార్మికులు తమ సొంత గ్రామాలకు చేరుకున్నారు. వీరు అత్యధికులు బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, గుజరాత్‌, ఒడిశా, రాజస్థాన్‌ రాష్ర్టాల వారే. పనుల్లేక కష్టాలుపడుతున్న కార్మికులను ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేక రైళ్లు, బస్సుల ద్వారా సొంత గ్రామాలకు తరలించాయి.

IHG

నాటి నుంచి కరోనా  కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. దక్షిణాదిలోనూ కరోనా గ్రామాల్లోకి విస్తరిస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌లో గత మూడువారాల్లో 1500 కేసులు నమోదుకాగా, అందులో 500 కేసులు గ్రామాల్లోనే వెలుగులోకి వచ్చాయి. కేరళలో కూడా.. కాసరగోడ్‌ జిల్లాలో 112, పాలక్కడ్‌లో 144 కేసులు నమోదయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: