ప్రపంచ దేశాలను కరోనా వైరస్ చిగురుటాకులా వణికిస్తోంది. గత 24 గంటల్లో దేశంలో 15,000కు పైగా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలలో సైతం రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో కేసుల సంఖ్య మరింత భారీగా పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మరణాల సంఖ్య తక్కువగా ఉండటం కొంత ఊరట కలిగించే విషయం. 
 
లాక్ డౌన్ సడలింపుల వల్ల కరోనా వ్యాప్తిని ఆపడం ఎవరి వల్లా కావడం లేదు. కరోనా సోకిన వారిలో ఇతర వ్యాధులతో బాధ పడుతున్న వారు ఎక్కువగా చనిపోతున్నారని... ఈ వైరస్ వల్ల ప్రాణాపాయం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలు కరోనాకు భయపడి ఇంట్లో నుంచి బయటకు వెళ్లకపోతే ఆకలి చావులు భరించాల్సి ఉంటుంది. అయితే విదేశాల్లో చిక్కుకుపోయి నరకయాతన అనుభవిస్తున్న వారి సంఖ్య కూడా భారీగానే ఉందని తెలుస్తోంది. 
 
వందే భారత్ మిషన్ ద్వారా పరిమిత సంఖ్యలో మాత్రమే భారత్ కు ప్రయాణికులను తీసుకొస్తున్నారు. అంతర్జాతీయ విమానాలకు కేంద్రం అనుమతులు ఇస్తే మాత్రం 15 లక్షల నుంచి 20 లక్షల మంది రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఛార్జీలు గతంలోలా సాధారణ స్థాయిలో ఉంటే ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎందుకంటే చాలా దేశాల్లో కరోనా విజృంభణ వల్ల ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి. 
 
తాత్కాలిక ఉద్యోగాలతో ఇతర దేశాల్లో జీవనం సాగిస్తున్న వారంతా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. కరోనా విజృంభణ ఎప్పటికీ ఆగుతుందో ఎవరూ చెప్పలేరు. జులై 15 తర్వాత కేంద్రం అంతర్జాతీయ విమానాలకు అనుమతులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. విదేశాల నుంచి లక్షల సంఖ్యలో ప్రయాణికులు వస్తే వారందరికీ పరీక్షలు నిర్వహించడం సులభం కాదు. చేతుల్లో డబ్బుల్లేక, తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతూ విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల బాధ వర్ణనాతీతం. 

మరింత సమాచారం తెలుసుకోండి: