వరుసగా రెండో రోజు నష్టాల్లో భారత మార్కెట్ ముగిసింది. బెంచ్ మార్కెట్ సూచీలు మంగళవారంనాడు తీవ్ర ఒడిదుడుకులకు లోనై మొత్తానికి నష్టాల బాట పట్టాయి. రోజు ఆరంభంలో భారీ లాభాల్లో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. ఫైనాన్షియల్, ఆటోమొబైల్ షేర్లలో లాభాల కనిపించిన ఫార్మా ఎనర్జీ నష్టాలతో లాభాలు కానరాకుండా పోయాయి. ఇక ఇంట్రాడేలో సెన్సెక్స్ 426 పాయింట్లు కదలాడగా, నిఫ్టీ కూడా 10262 పాయింట్లకు నుండి 10401 పాయింట్లు మధ్యలో కదలాడింది. ఇక రోజు ముగిసేసరికి సైన్సెస్ 40 పాయింట్లతో సెన్సెక్స్ నష్టపోయి 34916 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 7 పాయింట్ల నష్టంతో 10306 వద్ద మార్కెట్ ముగిసింది.

IHG

ఇక నేటి స్టాక్ మార్కెట్లో నిఫ్టీ 50 లో లాభనష్టాలు చూస్తే... మారుతి సుజుకి, ఐసిఐసిఐ బ్యాంక్, బ్రిటానియా, శ్రీ సిమెంట్ షేర్లు లాభాల బాట పట్టగా అందులో శ్రీ సిమెంట్ షేర్లు మూడు శాతం పైగా లాభపడ్డాయి. ఇక మరోవైపు సన్ ఫార్మా, గెయిల్, ఐ ఓ సి, పవర్ గ్రిడ్, బీపీసీఎల్ షేర్లు నష్టాల బాట నడిచాయి. అయితే ఇందులో బీపీసీఎల్ షేర్ 2 శాతం పైగా నష్టపోయింది.

 

 

ఇక మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల విషయానికొస్తే బ్రెంట్ ముడి చమురు బ్యారెల్ కు ధరలు 1.05 శాతం తగ్గి 41.4 డాలర్లకు చేరుకుంది. అలాగే డబ్ల్యూటీఏ ముడి చమురు ధర కూడా బ్యారెల్ కు 1.31 శాతం నష్టపోయి 39.1 డాలర్లకు చేరుకుంది. అలాగే భారత రూపాయి మారకం విలువ అమెరికా డాలర్ తో పోలిస్తే స్వల్పంగా 7 పైసలు లాభంతో 75.5 వద్ద ట్రేడ్ కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: