తెలుగు మీడియా రంగంలో బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవి అందరికీ సుపరిచితులు. ప్రముఖ మీడియా న్యూస్ ఛానల్ టీవీ9 లో పని చేసిన బిత్తిరి సత్తి తాజాగా ఆ ఛానల్ కి రాజీనామా చేసి సాక్షి లో జాయిన్ అయ్యారు. tv9 నుండి బయటకు వచ్చాక బిత్తిరి సత్తి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నట్లు మొన్నటి వరకు వార్తలు వైరల్ అయ్యాయి. అయితే తాజాగా సాక్షి ఛానల్ లో  చేరటంతో భారీ స్థాయిలో సాక్షి ఛానల్ యాజమాన్యంతో బిత్తిరి సత్తి డీల్ కుదుర్చుకున్నట్లు మీడియా రంగంలో వార్తలు వస్తున్నాయి. ఇస్మార్ట్ న్యూస్ తరహాలోనే సాక్షి లో కూడా వీక్షకులను అదే రీతిలో బిత్తిరి సత్తి అలరించనున్ననట్లు మీడియా సర్కిల్ లో టాక్.

 

గతంలో టీవీ9 మరియు v6 ఛానల్ లో తనదైన శైలిలో బిత్తిరి సత్తి వీక్షకులను అలరించడం జరిగింది. అయితే సాక్షి ఛానల్ లో మాత్రం ఆ రెండు ఛానల్ లో వేసిన గెటప్ లకు భిన్నంగా బిత్తిరి సత్తి సరికొత్త ప్రోగ్రాం తో అలరించబోతున్నారు అట. మరోపక్క బిత్తిరి సత్తి వెబ్ ఛానల్ పెట్టే ఆలోచనలో కూడా ఉన్నట్లు వార్తలు వినబడుతున్నాయి. అంతేకాకుండా కుదిరితే బిగ్ బాస్ హౌస్ లో కూడా బిత్తిరి సత్తి వెళ్లే అవకాశం ఉంది.

 

దానికి సాక్షి ఛానల్ యాజమాన్యం అడ్డుపడే అవకాశం లేదని అంత మాట్లాడుకొని బిత్తిరి సత్తి సాక్షి ఛానల్ లోకి వచ్చినట్లు సమాచారం. ఇక సాలరీ విషయానికొస్తే నెలకు దాదాపు రెండున్నర లక్షలు బిత్తిరి సత్తి కి సాక్షి ఛానల్ యాజమాన్యం ఇవ్వడానికి రెడీ అయ్యిందట. టీవీ9 నుండి వచ్చేయడమే సాక్షి ఛానల్ తో ఒప్పందం కుదరటమే మొదట సాలరీ పెంచేశారట. ఆ తరువాత మిగతా విషయాలు బిత్తిరి సత్తి తో సాక్షి యాజమాన్యం మాట్లాడుకున్నట్లు మీడియా వర్గాల్లో టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: