తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. కార్పొరేషన్ లకు చైర్మన్లు వేయడం కాదు కూర్చోడానికి కుర్చీలు ఉండాలి కదా అని నిలదీశారు. గతంలో ఆదరణ పథకం కింద కట్టిన డబ్బులు ,. ఆ పనిముట్లు  ఇవ్వడం లేదు ఇంక బీసీలకు మీరేం చేస్తారు అని ప్రశ్నించారు. చంద్రబాబు ఇల్లు మునిగిపోతే నీకేంటి అని ప్రశ్నించారు. చంద్రబాబు ఆ ఇంట్లో ఉంటే, జగన్ డౌన్ఫాల్  అవుతారని స్వరూపానంద చెప్పారట అన్నారు. అందుకే ఆ ఇంటి నుండి బయటకు పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

చంద్రబాబు బయటకు రావడం లేదంటున్నారని .. కుర్రోడు కదా మరి నువ్వు ఎందుకు బయటకు రావడం లేదని ఆయన ప్రశ్నించారు. మూలనున్న ముసలమ్మ లాగా బయటకు రావడం లేదు ఎద్దేవా చేసారు. వరద ముంపు గ్రామాల్లో,ఏరియల్ సర్వే అయినా చెయ్యాలి కదా.. అని ప్రశ్నించారు. విపక్షంలో ఉన్నప్పుడు కబుర్లు చెప్పిన జగన్ మోహన్ రెడ్డి  500 రూపాయలు ఇస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రి మీద అవినీతి ఆరోపణలు చేసాము ఆధారాలు చూపించామని... ఎందుకు చర్యలు తీసుకోలేదు అని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి.. ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి గారు  హిందువుల సాంప్రదాయాలను కాల రాయాలనే ఆలోచన తప్పు అని హితవు పలికారు. తిరుపతి సంప్రదాయాన్ని కాలరాస్తున్నారన్నారు. హుండీ డబ్బులు, బంగారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.  టీటీడీ పాలక మండలి కళ్లుమూసుకుపోయి పనిచేస్తుందా అని నిలదీశారు. మిమ్మల్ని చూసి ప్రజలు భయపడుతున్నారు. ప్రజలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉన్నాయని ఆయన హెచ్చరించారు. శిశుపాలుడు వంద తప్పులు వరకు కృష్ణుడు క్షమించాడు మేము కూడా 96 తప్పులు పూర్తయ్యాయన్నారు. ఆరేడు వేల ఎకరాలు భూమి విజయసాయిరెడ్డి కబ్జా కబ్జా చేశారని ఆరోపించారు. విశాఖలో బ్రహ్మసమాజం సింహాచలం భూములు సైతం దోచేస్తున్నరన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: