రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య తాజాగా జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏకపక్షంగా మ్యాచ్ ను గెలిచింది. వన్ సైడ్ మ్యాచ్ అన్నట్లుగా మ్యాచ్ మొత్తం ఆర్సిబి జట్టు వైపు నిలబడింది. అయితే ఈ మ్యాచ్ మొదలు కాక ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పై కలకత్తా నైట్ రైడర్స్ సులువుగా గెలుస్తుందని క్రికెట్ పండితులు జోస్యం చెప్పారు. ఇది ఇలా ఉండగా టీమిండియా మాజీ ఆటగాడు అలాగే కలకత్తా నైట్ రైడర్స్ జట్టు మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ మరో ముందడుగు వేసి అసలు కలకత్తా నైట్ రైడర్స్ కి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇస్తుందా అనే సందేహాన్ని వ్యక్తపరిచాడు.


అంతే కాదు.. గౌతమ్ మాట్లాడుతూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కలకత్తా నైట్ రైడర్స్ కు అసలు ప్రత్యర్థి కాదని కొట్టి పడేశాడు. ఇలా సమావేశం ముగిసిన తర్వాత అసలు మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కలకత్తా నైట్ రైడర్స్ మ్యాచ్ మొత్తంలో ఎక్కడ కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పోటీ ఇవ్వలేకపోయింది. ఇక అంతే.. మ్యాచ్ తర్వాత గౌతం గంభీర్ పై సోషల్ మీడియాలో తెగ విమర్శల వర్షం కురిసింది. ఇక గౌతం గంభీర్ ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫాన్స్ అయితే ఓ ఆట ఆడుకుంటున్నారు. అందులో కొందరు " ఏం గంభీర్.. మ్యాచ్ చూసావా.. ఇప్పుడేమంటావ్ " అంటూ డైరెక్టుగానే ప్రశ్నలు వేస్తున్నారు.


మరికొందరైతే మ్యాచ్ ముందర విశ్లేషణలో భాగంగా కలకత్తా నైట్ రైడర్స్ కు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అసలు పోటీనే కాదన్నావు, తాము టైటిల్ గెలిచిన వాళ్ళని తెగ మాట్లాడవు ఇప్పుడు ఏమైంది అని ఒక అభిమాని గాఢంగా గంభీర్ ని ట్రోల్ చేశాడు. ఇక మరో అభిమాని అయితే ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ నమోదు చేసిన అత్యధిక స్కోరు కంటే మరో రికార్డును కలకత్తా నైట్ రైడర్స్ అధిగమించలేకపోయిందని.. అది గమనించావా గంభీర్ అంటూ ఎద్దేవా చేశారు. మ్యాచ్ మొత్తం చూసే కలకత్తా నైట్ రైడర్స్ కేవలం ఒక క్లబ్ టీం మాదిరిగా చాప చుట్టేసింది. ఇలా ఆ మ్యాచ్ లో కలకత్తా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 84 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన రాయల్ చాలెంజర్స్ జట్టు కేవలం 13.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. కేవలం 2 వికెట్లు కోల్పోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు భారీ విజయాన్ని నమోదు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: