దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎలాగైనా సరే విజయం సాధించాలని భారతీయ జనతా పార్టీ కాస్త పట్టుదలగా ఉంది. టిఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడానికి భారతీయ జనతా పార్టీ నేతలు తీవ్రస్థాయిలో కష్ట పడుతున్నారు. వారికి అనుకూలంగా పరిస్థితి ఉన్నా లేకపోయినా సరే ఇప్పుడు దుబ్బాకలో ప్రచారం చేసే విషయంలో బిజెపి కాస్త దూకుడుగా వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇన్నిరోజులు ప్రచారానికి దూరంగా ఉన్న బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రచారం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. తాజాగా ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందన్ రావు కి ప్రచారం చేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్గా మంత్రి హరీష్ రావు టార్గెట్గా ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఎమ్మెల్సీ కవిత మీద కూడా ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మెదక్ పట్టణంలోని  జీకేఆర్ గార్డెన్ లో మీడియాతో మాట్లాడిన బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్... దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు భారీ మెజారిటీ తో గెలుస్తారని ధీమా వ్యక్తం చేసారు. మంత్రి హరీష్ రావు దగాకోరు అని మండిపడ్డారు. దమ్ముంటే...  రైతు లకు బోరు బావుల వద్ద మోటార్ లకు మీటర్లు పెడుతున్నట్లు నిరూపించ కపోతే రాజీనామా చేస్తాడా? అని నిలదీశారు.

అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం ఇవ్వరా? అని అయన ప్రశ్నించారు. మనం తినే ఆహారంలో 90% కేంద్ర ప్రభుత్వానిది వాటా ఉంది అని ఆయన అన్నారు. స్వచ్ భారత్, పనికి ఆహార పథకం, మహిళా సంఘాల కు తక్కువ వడ్డీకి రుణాలు వంటివి ఇస్తున్నారు అన్నారు. అదే విధంగా... హరితహారం కు 1400 కోట్ల రూపాయలు... వైకుంఠ దామలకు డబ్బులు అన్ని కేంద్రానివే అని ఆయన స్పష్టం చేసారు. రైతులు మక్కలు పండిస్తే కొనం అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం పద్దతి కాదని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: