ఎంత వత్తిడి లో ఉన్నా ఎలా నెగ్గాలో జగన్ నుంచి అందరు నేర్చుకోవాల్సిన విషయం. ఓ ఎనిమిది సంవత్సరాల ముందు జగన్ పరిస్థితి ఎలా ఉన్నది అనేది అందరికి తెలిసిందే.. ఓ వైపు తండ్రి మరణం, మరి వైపు కేసులు, ఇంకో వైపు అప్పుడే పుట్టిన పార్టీ భాధ్యతలు ఇవన్ని జగన్ కి ఒకేసారి ముంచుకు రావడంతో అయన ఎలా తట్టుకుని నిలబడతారో అని అందరు అనుకున్నారు.. కానీ జగన్ వాటిని అధిగమించి ఇప్పుడు ముఖ్యమంత్రి గా ఎదిగారు..  తనపై వచ్చిన ఆరోపణలను ప్రజలకు నిరూపిస్తే చాలు అని ప్రజల్లోకి వెళ్లి మరీ తనని తాను కాపాడుతున్నాడు.. అంతేకాదు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారు..

ఇక టీడీపీ పరిస్థితి వేరేలా ఉంది.. ఎంతో రాజకీయ చాణక్యుడు గా పేరున్న చంద్రబాబు టీడీపీ తరపున పనిచేసేది కొంతకాలమే.. అయన తర్వాత ఎవరో ఒకరు పార్టీ ని మోయాల్సిందే అందుకు లోకేష్ ని చంద్రబాబు సిఫారసు చేశారు.. కానీ చింబు వస్తే తాము పార్టీ లో ఉందాం అన్న భావన తెలుగు తమ్ముళ్లలో కనిపిస్తుంది.. తండ్రిని మోసాం కానీ కొడుకును కూడా మోయాలా? అనే వారు కొందరైతే, లోకేష్ కు రాజకీయంగా అంత కేపబిలిటీ లేదు? అంటూ పెదవి విరిచేవారింకొందరు. రాష్ట్ర, కేంద్ర స్థాయిల్లో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులను తట్టుకుని పార్టీని ముందుకు నడిపించడం చినబాబు వల్లకాదంటూ పెదవి విప్పేవారు ఇంకొందరుంటున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు వెన్నంటే నడిచిన నాయకులు, సామాజికవర్గాలు చినబాబును అంగీకరించడం లేదన్నది తేటతెల్లమైపోయిందంటున్నారు.

టీడీపీ నిలబెట్టుకునే క్రమంలో చంద్రబాబు తన శక్తికి మించే ప్రయత్నిస్తున్నట్టుగా అర్ధమవుతోంది. ఈ స్థాయిలో ప్రయత్నిస్తున్నప్పటికీ దూరమైపోయిన ఆయా వర్గాలు, నేతలను తిరిగి వెనక్కుతెచ్చుకోవడం సాధ్యమయ్యే పనిగా కన్పించడం లేదు. పక్కకు తప్పుకున్న వారు తమ మనుగడ వరకు మాత్రమే పనిచేసుకుంటే ప్రస్తుతానికి టీడీపీకి వచ్చిన ఇబ్బందులు పెద్దగా ఉండకపోవచ్చునన్న వాదన కూడా ఉంది. అలా కాకుండా తమ హవాను కొనసాగించుకునేందుకు వీరంతా కలిసి తగిన ప్రత్యామ్నాయ నాయకుడ్ని చూసుకుంటేనే ఇబ్బందులు తప్పవని వివరిస్తున్నారు. ఒక వేళ ఇదే పరిస్థితులు గనుక ఎదురైతే అసలే వృద్ధాప్యంలో ఉన్న చంద్రబాబుకు మరింత మనోవేదన తప్పదంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: