తెలంగాణలోని దుబ్బాక నియోజకవర్గం అసెంబ్లీ ఉప ఎన్నికల పోరు హోరాహోరీగా ఉంది. ముఖ్యంగా బిజెపి, టిఆర్ఎస్ పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా ఇక్కడ తలపడుతూ, గెలుపును తమ ఖాతాలో వేసుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ, తమ పార్టీ జెండాను ఈ నియోజకవర్గంపై ఎగురవేసేందుకు అన్ని పార్టీలు గట్టిగా కష్టపడుతున్నాయి. ఇక్కడ పోటీలో ఉన్న అన్ని పార్టీలకు చెందిన అగ్ర నాయకులంతా, ఈ నియోజకవర్గంలో తిష్ట వేశారు. కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాసరెడ్డి, బిజెపి నుంచి రఘునందన్ రావు, టీఆర్ఎస్ నుంచి సోలిపేట సుజాత పోటీలో ఉన్నారు. అయితే ఇది టిఆర్ఎస్ సెట్టింగ్ స్థానం కావడంతో గెలుపుపై ఆ పార్టీ ధీమా గానే ఉంది.



 ఇక్కడ పూర్తి బాధ్యతలు మంత్రి హరీష్ రావు స్వీకరించి అభ్యర్థి గెలుపు కోసం గట్టిగానే కష్టపడుతున్నారు. కాంగ్రెస్ నాయకులంతా ప్రచారం లో దిగినా, ఇక్కడ ఛాన్స్ ఉంటుందా లేదా అనేది ఆ పార్టీ నేతలకు సైతం అనుమానంగానే ఉంది. ఇక బిజెపి అయితే గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దుబ్బాక నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంగా ఈ నియోజకవర్గంలో నిశ్శబ్ద యుద్ధం కనిపిస్తోందని, గెలుపు బీజేపీ దే అంటూ వ్యాఖ్యానించారు. ఇక కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తే కాంగ్రెస్ కు ఓటు వేసి నా అది వృదనే అవుతుందని, ఇక్కడి నుంచి ఆ పార్టీ తరఫున అభ్యర్థి గెలిచినా, వెంటనే టిఆర్ఎస్ పార్టీలో చేరుతారని, కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ కు ఓటు వేసినా, టిఆర్ఎస్ కు ఓటు వేసినా, ఒకటే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 



ఇదిలా ఉంటే ఈ నియోజకవర్గంలో ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉందో అనేది ఎవరికీ అంతుపట్టడం లేదు. ఓటర్ల నాడీ పసిగట్టేందుకు అన్ని పార్టీలు గట్టిగా ప్రయత్నాలు చేస్తూ, వారిని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇక్కడ పోరు నువ్వు నేనా అన్నట్టుగా ఉంది. ముఖ్యంగా బిజెపి టిఆర్ఎస్ లు స్పీడ్ పెంచి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వాతావరణాన్ని వేడెక్కించే పనిలో ఉన్నాయి. కేంద్ర బిజెపి పెద్దలు సైతం ఈ నియోజకవర్గంలో గెలుపు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో, తెలంగాణ బిజెపి నేతలు మరింత గట్టిగా గెలుపు కోసం ఆరాటపడుతున్నారు. అదీ కాకుండా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా, బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు కావడంతో, బండి సంజయ్ సత్తా కు ఈ ఎన్నికలు నిదర్శనంగా కనిపిస్తోంది. అందుకే బీజేపీ ఇక్కడ గట్టిగానే కష్టపడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: