కరోనా  వైరస్ కారణంగా దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో రోడ్డు రవాణా సర్వీసులు పూర్తిగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇక లాక్ డౌన్ కొనసాగించే అన్ని రోజులు ఒక్క బస్సు కూడా రోడ్డెక్క లేదు అన్ని బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి ఆ తర్వాత అన్లాక్  మార్గదర్శకాల లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు అంతర్ రాష్ట్ర రోడ్డు రవాణా సర్వీసులు ప్రారంభం అనుమతులు ఇచ్చింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రస్తుతం ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభించాయి. అయితే కరోనా  వైరస్ వ్యాప్తి ని దృష్టిలో పెట్టుకుని కేవలం తక్కువ సంఖ్యలో మాత్రమే బస్సు సర్వీసులు ప్రారంభించాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు.



 తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే తరహా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణ రాజధాని నగరమైన భాగ్యనగరంలో 25 శాతం మాత్రమే ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. అన్లాక్  మార్గదర్శకాలు విడుదల చేసిన తర్వాత బస్సు సర్వీసులు ప్రారంభించాక ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు ఆర్టీసీ బస్సులో ప్రయాణించేందుకు ఆసక్తి చూపలేదు. కానీ క్రమక్రమంగా ప్రజలలో అవగాహన పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రస్తుతం అందరూ కూడా... ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.



 ఈ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న 25 శాతం ఆర్టీసీ బస్సు సర్వీసులు సరిపోవడం లేదు ఈ క్రమంలోనే కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ఆర్టీసీ ఇటీవలే ప్రయాణికులు అందరికీ గుడ్ న్యూస్ చెప్పింది. నగరంలో సోమవారం నుంచి 50 శాతం ఆర్టీసీ బస్సులు  రోడ్డెక్కాయి. గతంలో 25 శాతం మాత్రమే బస్సు సర్వీసులు నడపగా.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రస్తుతం 50 శాతం బస్సు సర్వీసులను నడుపుతున్నాను అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా బస్సు కౌంటర్ల ను కూడా మరో 25 పెంచుతూ  నిర్ణయం తీసుకున్నారు. కాగా ప్రస్తుతం 50 శాతం బస్సులను నడపాలని ప్రభుత్వ నిర్ణయంతో ఆర్టీసీ మళ్లీ పుంజుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: