గ్రేటర్ ఎన్నికల పోరు రోజురోజుకు రసవత్తరంగా మారుతుంది. అధికార ప్రతిపక్ష రాజకీయ పార్టీల మధ్య మాటలు తూటాల్లా మారుతూ తారాస్థాయికి చేరుకుంటున్నాయి. అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా ఎవరికి వారు విస్తృత ప్రచారం తో ప్రజల్లో ముందుకు సాగుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే గ్రేటర్ ఎన్నికల పోరు మునుపెన్నడూ లేనంతగా ఈసారి ఎన్నికల పోరు కనిపిస్తుంది. ముఖ్యంగా జిహెచ్ఎంసి ఎన్నికల్లో ప్రధాన పోటీ టిఆర్ఎస్, బిజెపికి ఉండనున్నట్టు తెలుస్తుంది. మిగిలిన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ పార్టీల ప్రభావం ఎంత మేర ఉంటుందో తెలియదు కానీ బిజెపి, టిఆర్ఎస్ పార్టీలు మాత్రం ప్రచారాలలో తమ జోరు చూపిస్తున్నాయి.

బిజెపి పార్టీకి చెందిన పలువురు నాయకులు ఉప్పల్ పరిధిలోని హబ్సిగూడ డివిజన్ పరిధిలో ఎన్నికల ప్రచారం చేశారు. బిజెపి ప్రకటించిన మేనిఫెస్టో గురించి ప్రజలకు తెలియజేస్తూ తమ పార్టీని, పార్టీ నాయకుడిని గెలిపించ వలసిందిగా ప్రజలను కోరారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే పక్షపాతం లేకుండా ప్రతి ఒక్కరికి చేయూతగా నిలుస్తుందని బిజెపి పార్టీ అభ్యర్థి కక్కిరేణి చేతన హరీష్ తెలిపారు. టిఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని మాయమాటలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. టిఆర్ఎస్ పార్టీలో ప్రతినాయకులు స్వార్థబుద్ధితో స్వలాభం కోసం ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని హైదరాబాదులో ఘోరంగా ఓటమి పాలు చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు .

ఉప్పల్లోని ప్రజలకు తమ మేనిఫెస్టో గురించి వివరిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. వారు ఇంటింటికి తిరుగుతూ బిజెపి పార్టీ అభ్యర్థి కక్కిరేణి చేతన హరీష్ గెలిపించ వలసినదిగా ప్రజలను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో తదితర బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదేమైనప్పటికీ ప్రచారాల్లో టీఆర్ఎస్ కంటే బిజెపి ముందుందని చెప్పాలి. దుబ్బాక ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన బిజెపి గ్రేటర్ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని చూస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: