తెలంగాణ రాజకీయాలలో వేడి రాజేసి ఊపేసిన గ్రేటర్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ నేడు ఉదయం నుంచి ప్రారంభమైంది సాయంత్రం 6 గంటల వరకు గ్రేటర్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలోనే ఎంతో మంది ఓటర్లు గ్రేటర్ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రస్తుతం సిద్ధమయ్యారు. అయితే ఈసారి సరైన అభ్యర్థి ఎన్నుకునేందుకు ఓటర్లు అందరూ సిద్ధమయ్యారు. మొన్నటి వరకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు అందరూ ముమ్మర ప్రచారం నిర్వహించారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటర్లను ఏ మేరకు ప్రసన్నం చేసుకొని ఆకర్షించారు.. అభివృద్ధి చేస్తామని ఎంతలా ప్రజల్లో నమ్మకం కలిగించారు అన్నది నేడు తేల్చనున్నారు  ఓటర్లు.



 ఇక జిహెచ్ఎంసి ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం అటు అధికారులు కూడా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు అన్న విషయం తెలిసిందే. ఎక్కడ ఏ పోలింగ్ కేంద్రంలో  కూడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు... ప్రస్తుతం అన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు అధికారులు అంతేకాకుండా పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ కూడా విధించారు. ఉదయం నుంచి పోలింగ్ ప్రారంభమైన నేపథ్యంలో ఎంతోమంది రాజకీయ సినీ ప్రముఖులు కూడా ఉదయం సమయంలోనే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.



 ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి దంపతులు కాచిగూడ లో ఉన్న పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటు వేయకుండా ఇంట్లో కూర్చో వద్దు అంటూ సూచించారు. ఇక తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దంపతులు నంది నగర్ లోని 8వ పోలింగ్ బూతులో ఓటు వేసి  హక్కు వినియోగించుకున్నారు ప్రతి ఒక్కరు ఓటు వేసి అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఈ సందర్భంగా కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: