జి‌హెచ్‌ఎం‌సి ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి కీలకంగా మారాయి.ఫలితాల తర్వాత టి‌పి‌సి‌సి పదవిని మార్చే ఆలోచనలో ఉందట కాంగ్రెస్ అధిష్టానం.ఇందుకు సంభందించిన కసరత్తులు మొదలు పెట్టిందని సమాచారం.ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోయినప్పటి నుండి రెండు తెలుగు రాష్ట్రాలలో ఊహించని ఎదురుదెబ్బ తగిలి ఘోర పరాభవం మూటగట్టుకుని ఇప్పటికీ కూడా కోలుకోలేని స్తితిలో వుంది.2014 ఎన్నికల నుంచి.మొన్న జరిగిన దుబ్బాక ఉపఎన్నికల వరకూ పార్టీకి వరుస ఓటములు ఎదురవుతూనే వున్నాయి.

ఈ నేపథ్యంలో టీపీసీసీకి కొత్త సారథి అవసరమని పార్టీలోని అన్ని వర్గాలూ అంటున్నాయట.దీంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆ దిశగా దృష్టి పెట్టింది. దుబ్బాక ఉపఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ అనూహ్యంగా బలం పెంచుకున్న నేపధ్యంలో తమ పార్టీకి  ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే అవకాశం కాంగ్రెస్‌ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. టి‌పి‌సి‌సి చైర్మెన్ మార్పుపై టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి సహా పలువురు నేతలు బాహాటంగానే మాట్లాడుతున్నారు.

అయితే టి‌పి‌సి‌సి అద్యక్ష బాద్యతలు ప్రజాకర్షణ కలిగిన నేత, ఎంపీ రేవంత్‌రెడ్డికి అప్పగించాలని కాంగ్రెస్ లోని ఓ వర్గం గట్టిగా డిమాండ్ చేస్తున్నారట.అయితే మరి కొందరు శ్రీధర్‌బాబుకు పగ్గాలు అప్పగించాలన్న ప్రతిపాదనను అధిష్ఠానం ముందు ఉంచినట్లు చెబుతున్నారు.మరోవైపు టీపీసీసీ అధ్యక్ష రేసులో తాను కూడా  ఉన్నానంటున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధిష్ఠానం వద్ద ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.అయితే ఎక్కువ మంది రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నారట.దీంతో పార్టీ అధిష్టానం ఆ దిశగా కసరత్తులు చేస్తున్నతు సమాచారం.. 

మరింత సమాచారం తెలుసుకోండి: