సంక్షేమ కార్యక్రమాలను ఏ విధంగా అమలు చేస్తున్న సరే వాటిని ప్రజలలోకి తీసుకొని వెళ్లలేక పోతే మాత్రం అనేక ఇబ్బందులు రాజకీయ పార్టీలకు ఉంటాయి అనే విషయం స్పష్టంగా చెప్పాలి. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు అదే జరిగింది అనే విషయం అర్థమవుతుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాలా మంది టిఆర్ఎస్ పార్టీ నేతలు సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్లలేకపోయారు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే భారతీయ జనతా పార్టీ దూకుడుగా ఉంది.

కాబట్టి టిఆర్ఎస్ పార్టీ ప్రజల మద్దతు పొందే విధంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ టిఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం చాలావరకు బాధ్యతలను కేటీఆర్ మీద వదిలేసి ప్రచారంలో కూడా పెద్దగా పాల్గొన్న పరిస్థితులు లేవు. ఎమ్మెల్యేలు కూడా పెద్దగా ప్రచారం చేయడానికి ఆసక్తి చూపించలేదు. మంత్రులకు కీలక బాధ్యతలు ఇచ్చినా వారు కూడా పెద్దగా ఆశించిన స్థాయిలో ప్రచారం చేయలేకపోయారు అనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఉన్నాయి. ఇక భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేది తెలియదు.

కానీ టిఆర్ఎస్ పార్టీ మాత్రం ఇప్పుడు కచ్చితంగా ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం అనేది ఉంది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. సీఎం కేసీఆర్ ఇప్పటివరకు ప్రజల్లోకి వెళ్లడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. కానీ ఇక నుంచి మాత్రం ఆయన ప్రజల్లోకి వెళ్లే విషయంలో చాలా వరకు జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం అనేక ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో టిఆర్ఎస్ పార్టీ ఊహించని విధంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రజల్లోకి వెళ్లే విధంగా కొన్ని కొన్ని వ్యాఖ్యలు చేయడం, కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అనేది టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం మీద ఉంది అనే విషయం ఖచ్చితంగా చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: