సాధారణంగా డ్రైవింగ్ నేర్చుకోవాలి అంటే ప్రత్యేకంగా డ్రైవింగ్ స్కూల్స్ ఉంటాయి అన్న విషయం తెలిసిందే ఇక ప్రతి ఒక్కరు కూడా డ్రైవింగ్ నేర్చుకోడానికి ఇలా డ్రైవింగ్ స్కూల్స్ ని ఆశ్రయించి..  డ్రైవింగ్ స్కిల్స్ పొందుతూ ఉంటారు.  కానీ కొంతమంది మాత్రం నిర్లక్ష్యంగా డ్రైవింగ్ రాకుండానే రోడ్ల మీదకు వచ్చి ఎన్నో రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతూ ఉంటారు. అంతే కాకుండా ఇతర వ్యక్తుల ప్రాణాలు పోవడానికి కూడా కారణమవుతుంటారు  ఎంతో మంది వ్యక్తులు. డ్రైవింగ్ రాకపోయినప్పటికీ లైసెన్స్ లేకపోయినప్పటికీ ఇక డైరెక్టుగా కార్ తీసుకొని రోడ్డుమీదికి వచ్చేస్తారు.



 చివరికి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ కారణంగా ఎన్నో రోడ్డు ప్రమాదాలకు కారణమై కటకటాల పాలవుతూ ఉంటారు లేదా చివరికి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళి పోతూ ఉంటారు.  ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది.  ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సిన లాయర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. అంతేకాదు ఒక వ్యక్తి ప్రాణాల మీదకు తీసుకువచ్చాడు. తన దగ్గరికి శిష్యరికం కోసం వచ్చిన లాయర్ కు లా  వృత్తిలో ట్రైనింగ్ ఇవ్వకుండా డ్రైవింగ్ నేర్పించాలని అనుకున్నాడు.  కానీ చివరికి ఇలా డ్రైవింగ్ నేర్పించాలి అనే ఆలోచనే లాయర్ను కటకటాల పాలు చేసింది.  జన సందోహం లేని ప్రాంతంలో కాకుండా నేరుగా అతని ట్రైని కీ కారు డ్రైవింగ్ నేర్పించే క్రమంలో ముంబై హైవే పైన కు వచ్చేశాడు.



 దీంతో పొరపాటున ఒక స్కూటీని ఢీకొట్టారు.  ఈ క్రమంలోనే స్కూటీపై వెళుతున్న వ్యక్తి స్పృహతప్పి అక్కడికక్కడే పడిపోయాడు.  దీంతో కారు దిగి చూసేసరికి అతడు గాయాలతో ఉండడంతో చనిపోయాడు అని అనుకున్నారు ఇద్దరూ లాయర్లు. దీంతో ఈ విషయం ఎక్కడా బయట పడకుండా ఉండేందుకు వాడిని ముంబై అహ్మదాబాద్ నేషనల్ హైవే దగ్గర ఎవరూ చూడకుండా పడేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.ఈ క్రమంలోనే సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఇద్దరు లాయర్ల ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: