ఈ మధ్యకాలంలో సైబర్ నేరాల బెడద రోజురోజుకు పెరిగిపోతోంది అన్న విషయం తెలిసిందే. ఇక సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు ప్రజలకు ఎప్పటికప్పుడు పోలీసుల అవగాహన కల్పించినప్పటికీ.. అంతేకాకుండా సైబర్ నేరగాళ్ల పై ఉక్కుపాదం మోపి అరెస్టు చేసి శిక్షలు వేసినప్పటికీ..  సైబర్ నేరాల బెడద మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఇక రోజురోజుకు కోకొల్లలుగా పుట్టుకొస్తున్న సైబర్ నేరగాళ్లు ఏదో ఒక విధంగా జనాలను బురిడీ కొట్టించి చివరికి భారీగా డబ్బులు దండుకుంటున్న ఘటనలు ఎన్నో తెరమీదకు వస్తున్నాయి ఈ మధ్యకాలంలో.



 కొంతమంది డబ్బు ఉన్న వాళ్లనే టార్గెట్ చేసి భారీగా డబ్బులు దండుకుంటూ  ఉంటే మరి కొంతమంది సైబర్ నేరగాళ్లు ఇక ఒక్కో రూపాయి  కూడగట్టుకొని ఇక ఇంటిని పోషించుకుంటూన్న  ఎంతో సామాన్య ప్రజలను కూడా వదలడం లేదు. ఇక ఏదో ఒక విషయంలో సామాన్యులకు ఆశ చూపి ఇక ఆ తర్వాత ఖాతాలను పూర్తిగా ఖాళీ చేసి సామాన్యులను అంధకారంలోకి నెడుతున్న  ఘటనలు ఎన్నో తెరమీదికి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.



 సైబర్ నేరగాళ్ల చేసిన పనికి ఏకంగా ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆన్లైన్ మోసం ఓ ప్రాణాన్ని బలితీసుకుం.ది విషాదకర ఘటన కామారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. లక్ష్మణ్ అనే వ్యక్తి కామారెడ్డిలో నివసిస్తున్నాడు అయితే ఆరు నెలల క్రితం లక్ష్మణ్ భార్యకు కౌన్ బనేగా కరోడ్పతి ద్వారా 25 లక్షలు గెలుచుకున్న ట్లుగా మొబైల్ కు మెసేజ్ వచ్చింది. ఈ డబ్బు మొత్తం పొందాలి అంటే 2.5 లక్షలు కట్టాలి అంటూ చెప్పారు. దీంతో లక్ష్మణ్ అప్పుతెచ్చి మరి ఆ డబ్బులు కట్టాడు. ఇక ఆ తర్వాత మోసపోయానని గ్రహించి మనస్థాపం చెంది కొడుకులకు వీడియో కాల్ చేసి మరి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకులు ఎంత వేడుకున్నా తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: