ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కొంతమంది మంత్రులు పెద్దగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేయటం లేదు. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు కొంత మంది మంత్రుల విషయంలో సీరియస్ గానే ముందుకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. చాలా మంది మంత్రులు ప్రజల్లోకి వెళ్లే అవకాశాలు ఉన్నా సరే పెద్దగా ప్రజల్లోకి వెళ్లడానికి ఆసక్తి చూపించడం లేదు. దీని కారణంగా పార్టీ కార్యకర్తలు కూడా ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఎమ్మెల్యేలు మీద కూడా సీఎం జగన్ సీరియస్ గా ఉండే అవకాశాలున్నాయని సమాచారం.

రాయలసీమ జిల్లాలో మీడియాతో మాట్లాడే ప్రయత్నాలు కూడా చేయడం లేదు. చాలామంది బెంగళూరు లోనే ఉంటున్నారు. లేకపోతే హైదరాబాదులో ఉంటున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు హైదరాబాద్ నుంచి నియోజకవర్గాలకు వచ్చి దాదాపు ఆరు నెలలకు పైగా అయింది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. స్థానిక ఎన్నికల సమయంలోనే వాళ్లు వచ్చారని సమాచారం. దీనితో ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు వాళ్ళ మీద కఠిన చర్యల దిశగా అడుగులు వేస్తున్నారు. వాళ్ళను పదవుల నుంచి తప్పించడానికి కూడా రెడీ అయినట్లు సమాచారం.

తన మాట వినని మంత్రుల విషయంలో జగన్ చాలా సీరియస్గా ఉన్నారు అని తెలుస్తుంది. ఇప్పటికే కొంత మంది మంత్రులకు  సమాచారాన్ని కూడా పంపించారు. నియోజకవర్గాల్లో లేకుండా అమరావతిలో లేకపోతే హైదరాబాదులో ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించేది లేదని ఇప్పటికీ స్పష్టంగా చెప్పారు కూడా. ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. తాజాగా జరిగిన కేబినేట్ సమావేశంలో కూడా మంత్రుల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. చాలా వరకు కూడా నియోజకవర్గాలకు రాకుండా వ్యక్తిగత అవసరాల కోసం మాత్రమే ప్రాధాన్యత చూపిస్తున్నారు అనే విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ గ్రహించారని తెలుస్తుంది. మరి వారి మీద ఏ విధంగా చర్యలు తీసుకుంటారు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: