జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశాలు ఉండవచ్చు అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. అయితే ఎప్పుడు వెళ్తారు ఏంటనే దానిపై స్పష్టత లేకపోయినా త్వరలోనే ఈ పర్యటనకు సంబంధించి ఓ క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళితే మాత్రం కచ్చితంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో కొన్ని అంశాల్లో స్పష్టత తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేసి అంశానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తీసుకువచ్చే అవకాశాలు ఉండవచ్చని భావిస్తున్నారు.

తమ పార్టీ పోటీ చేస్తుందని పార్టీ నేతలకు తన పార్టీ రంగం లోకి దిగుతున్నది అని బిజెపి నేతలకు పవన్ కళ్యాణ్ ఇప్పటికే స్పష్టంగా చెప్పారట. జనసేన పార్టీ నేతల వద్ద దీనిపై ఆసక్తికర చర్చలు ఉన్నాయి. జనసేన పార్టీ నేతలు కూడా తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశానికి సంబంధించి ఇప్పటికే కొన్ని క్లారిటీ లు పవన్ కు ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయకపోతే మాత్రం చాలా మంది జనసేన పార్టీ నేతలు బయటకు వెళ్ళిపోయి అవకాశాలు ఉండవచ్చు అని ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది.

కొంత మంది అగ్ర నేతలు కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ వద్ద కొన్ని వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తుంది. నాదెండ్ల మనోహర్ కూడా ఇప్పటికే తాను జనసేన పార్టీ పోటీ చేయకపోతే బయటికి వెళ్లిపోతాను అని చెప్పారట.  అలాగే తోట చంద్రశేఖర్ కూడా తిరుపతి ఉప ఎన్నికల విషయంలో సీరియస్గా ఉన్నారు అని అంటున్నారు. అలాగే చిత్తూరు జిల్లా నేతలు కూడా కొంతమంది తిరుపతి ఉప ఎన్నికల మీద చాలా సీరియస్గా ఆశలు పెట్టుకున్నారని ఎన్నికల్లో పోటీ చేయలేదు అంటే మాత్రం కచ్చితంగా జనసేన పార్టీ కార్యకర్తలు కూడా పార్టీలో ఉండే అవకాశం లేదని హెచ్చరిస్తున్నారు. మరి ఎంత మంది నేతలు బయటకు వెళ్తారు ఏంటి అని చూడాలి. అందుకే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి కొన్ని విషయాల్లో స్పష్టత తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: