ఆంధ్రప్రదేశ్ లో చాలా వరకు కూడా సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు విషయంలో సీఎం జగన్ లో అసంతృప్తి ఎక్కువగా ఉన్నా సరే... ఈ కార్యక్రమాలను యువతకు అందించే విషయంలో చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది నేతలు మీద నేరుగానే అసహనం వ్యక్తం చేసినట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది  అని ఎన్నిసార్లు చెప్పినా సరే కొంత మందిలో మార్పు రావడం లేదని ఈ నేపథ్యంలోనే కొంతమందిని పదవుల నుంచి కూడా తప్పించి ఆలోచనలో ఉన్నాను అని కొంతమంది వద్ద ఆయన వ్యాఖ్యానించారట.

యువతను ఆకట్టుకునే విషయంలో ముందు నుంచి కూడా జగన్ సీరియస్ గానే ఉన్నా సరే ఇప్పుడు మాత్రం ఆయనకు అనుకున్న విధంగా పరిస్థితి కనబడటం లేదు. ఈ నేపథ్యంలోనే కొంతమంది నేతల విషయంలో కూడా జగన్ సీరియస్ గా దృష్టి సారించి వారికి షాక్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. అయితే ఇప్పుడు విశాఖ జిల్లా విషయానికి వస్తే అక్కడ ఉన్న యువతకు మూడు రాజధానులు అవసరాన్ని వివరించే ప్రయత్నం వైసీపీ నేతలు ఎవరూ చేయడం లేదు.

ముఖ్యంగా మూడు రాజధానులు విషయంలో యువత లబ్ధి పొందే అవకాశాలుంటాయి. అయినా సరే చాలా మంది నేతలు ఎక్కువగా దృష్టి పెట్టలేకపోతున్నారు. అందుకే వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అలాగే అధికారులతో కూడా సమన్వయం చేసుకునే విషయంలో చాలా మంది నేతలు విఫలమవుతున్నారు. కొంత మంది అయితే కనీసం మంత్రులకు కూడా సమాచారం ఇవ్వడం లేదని దీని కారణంగా మంత్రులు కూడా ఇబ్బంది పడుతున్నారని అధికారులతో కూడా మాట్లాడే ప్రయత్నం ఎమ్మెల్యేలు చేయడం లేదని దీని వలన పార్టీ కూడా ఇబ్బంది పడుతుంది అనే భావనలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారట. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: