రాజకీయంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కొన్ని అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ముందుకు వెళ్తున్నది. తెలుగుదేశం పార్టీని ఎలా అయినాసరే ఇబ్బంది పెట్టాలని భావించే ముఖ్యమంత్రి జగన్ కొంతమందికి కొన్ని విధాలుగా ప్రోత్సాహం అందించడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కాస్త ఇబ్బంది పడుతున్నట్టు కనపడటంతో ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ కూడా కాస్త ఎక్కువగానే ఫోకస్ చేస్తున్నారు. ఇక తాజాగా కరోనా వ్యాక్సిన్ కి సంబంధించి ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.

రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ని టార్గెట్ చేసే క్రమంలో భారత్ బయోటెక్ ని అలాగే రామోజీరావుని ఇద్దరినీ కూడా ముఖ్యమంత్రి జగన్ టార్గెట్ చేస్తూ మాట్లాడటం పట్ల చాలామంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి భారత్ బయోటెక్ అనేది ఒక చిన్న సంస్థ. అక్కడ వ్యాక్సిన్ తయారీ నెలకు కోటి డోస్ లు మాత్రమే జరుగుతూ ఉంటుంది. కానీ సీరం ఇనిస్టిట్యూట్లో భారీగా వ్యాక్సిన్ తయారు చేస్తారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కట్టకుండా కేవలం ఒక సంస్థను టార్గెట్ చేయాలనే లక్ష్యంతోనే ఈ విధంగా ముందుకు వెళుతుంది అని ఆరోపణలు ఎక్కువగా చేస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా జాగ్రత్తగా ముందుకు వెళుతుంది. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసే వ్యాఖ్యలు కాస్త ఇబ్బంది లేకుండా ఉండాలి. కానీ ఇప్పుడు జగన్ తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి తెలుగుదేశం పార్టీని అలాగే మరికొందరిని టార్గెట్ చేయడం పట్ల చాలామంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇదే కొనసాగితే జగన్ ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. వ్యాక్సిన్ తయారీ సంస్థలకు రాష్ట్రప్రభుత్వం డబ్బులు కట్టలేదు అనే విషయం అర్థం అవుతున్నా  సరే జగన్ ఈ విధంగా ఎలా మాట్లాడుతారు అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: