ప్రస్తుతం దేశం మొత్తం కరోనా వైరస్ తో అల్లాడి పోతుంది. రోజురోజుకు ప్రమాదకర స్థాయిలో కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరికి ప్రాణభయం పట్టుకుంది. రోజురోజుకు దేశంలో విపత్కర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మొదటి రకం వైరస్ తో పోల్చి చూస్తే రెండవరకం వైరస్ మరింత ఎక్కువగా ప్రభావం చూపుతూ ఉన్న నేపథ్యంలో ఎంతోమంది ఆసుపత్రి ఫాలవుతున్నారు..  అదే సమయంలో అటు ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి  అదే సమయంలో ఇక చాలామంది వైరస్ బారిన పడినప్పటికీ మనోధైర్యంతో వైరస్ను జయిస్తున్నారు.



 అయితే గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం చాలామందిలో కరోనా వైరస్ పై అవగాహన పెరిగి పోయింది. కరోనా వైరస్ బారినపడి ప్రాణాలు పోయాయని తగిన జాగ్రత్తలు పాటిస్తే వైరస్ నుంచి బయటపడవచ్చు అంటూ ఎంతో మంది ప్రస్తుతం మనోధైర్యంతో ఉంటున్నారు.  కానీ ఆ ధైర్యాన్ని చంపేసేందుకు ఎప్పుడూ ఏదో ఒకటి జనాల వెంట పడుతూనే ఉంది. ఇప్పటికీ కరోనా వైరస్ సోకి ఎంతోమందిని ప్రాణాలను బలి తీసుకుంటుంది .  ఇక ఇప్పుడు ఈ మహమ్మారి వైరస్ నుంచి కోలుకోగానే బ్లాక్ ఫంగస్ అనే మరో వైరస్ కూడా అటాక్ చేస్తూ ఉండడం అందరినీ మరింత ఆందోళన కలిగిస్తోంది.



 అయితే ఇక ఈ వైరస్ కూడా ప్రాణాంతకమైనది కావడం గమనార్హం. ఇక ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ వైరస్ తో ఒకరు మృతి చెందడం అందరిలో భయాందోళనలు పెంచేస్తుంది. నిర్మల్ జిల్లా బైంసా డివిజన్కు చెందిన ఓ వ్యక్తి బ్లాక్ ఫంగస్ బారిన పడ్డాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇటీవలే ప్రాణాలు వదిలాడు సదరు వ్యక్తి. అయితే దీనిపై ఇప్పటివరకు ఆసుపత్రి యాజమాన్యం మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇకపోతే అటు గాంధీ ఆస్పత్రిలో కూడా బ్లాక్ ఫంగస్ బారినపడి ముగ్గురూ రోగులు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.  ఇక ఇటీవలే ఈ విషయంపై స్పందించిన గాంధీ ఆసుపత్రి సూపర్-ఇండెంట్ కరోనా వైరస్ సమయంలో స్టెరాయిడ్స్ ఎక్కువగా తీసుకున్న ప్రతి ఒక్కరికి బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం లేదు అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: