చంద్రబాబు విశేషమైన అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు. ఆయనే చెప్పుకున్నట్లుగా దేశంలోని సీనియర్ మోస్ట్ లీడర్లలో ఒకడు. ఇక తెలుగు రాష్ట్రాలలో కూడా ఆయనంత సీనియారిటీ కొద్ది మందికి మాత్రమే ఉంది. ఇదిలా ఉంటే చంద్రబాబు ఇపుడు దూకుడుగా రాజకీయం చేయాల్సిన సమయం అని అంతా భావిస్తున్నారు.

ఏపీలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా కేంద్రం నుంచి రాబట్టాల్సినవి చాలానే ఉన్నాయి. విభజన హామీలు తీర్చలేదు, అలాగే ప్రత్యేక హోదా ఇవ్వలేదు. పోలవరానికి సంబంధించి సవరించిన నిధులు కూడా ఇవ్వలేదు. ఇక తాజాగా పెట్టిన కుంపటి ఏంటి అంటే విశాఖ  స్టీల్ ప్లాంట్ ని కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు. మరో వైపు క్రిష్ణా జలాలా విషయంలో కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ లో తీరని అన్యాయమే జరిగింది అన్న మాట ఉంది.

వీటన్నిటి మీద బాబు సీనియర్ మోస్ట్ నేతగా, మాజీ ముఖ్యమంత్రిగా లీడ్ తీసుకుని పోరాడితే బాగుంటుంది అన్న మాట ఉంది. సొంత పార్టీలో కూడా దీని మీద చర్చ ఉంది. కానీ చంద్రబాబు మాత్రం ఒక్కో సమస్యలు ఒక్కో విధంగా  రియాక్ట్ అవుతున్నారు. కొన్ని సమస్యల పైన ఆయన అసలు మాట్లాడడం లేదు. ఇక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద ఆయన జగన్ ముందుండి పోరాడాలి అంటున్నారు. అది పక్కా రాజకీయ వ్యూహం తప్ప మరేమీ కాదు, బాబు అనుకున్నట్లుగా జగన్ ముందుకు రారు అన్నది ఒక భావన.

ఒకవేళ జగన్ ముందుండి పోరాటానికి రెడీ అయితే క్రెడిట్ కూడా అయనకే పోతుంది కదా. మరి సీనియర్ మోస్ట్ నేతకు ఈ సంగతి తెలియదా అన్నదే ఇక్కడ పాయింట్. ఇక  జగన్ పార్టీ ఆయన ఇష్టం, బాబు టీడీపీ అధినేతగా ముందుండి నాయకత్వం వహించవచ్చు కదా అన్నది ఉక్కు కర్మాగారం కార్మికుల మాటగా ఉంది. మరి బాబు ఎందుకో తాను వెనకే ఉంటాను అంటున్నారు. ముందుండి పోరాడితే రాజకీయ లాభం ఏదో బాబుకే వస్తుంది కదా. మరి ఈ దిశగా తెలుగు వల్లభుడు ఆలోచిస్తే ఏపీలో టీడీపీ సైకిల్ పరుగులు పెట్టడం ఖాయమే.


మరింత సమాచారం తెలుసుకోండి: