తెలంగాణ‌లో మునుగోడు రాజ‌కీయాలో హాట్ హాట్‌గా మారాయి. ఇప్ప‌టికే హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల వేళ రాష్ట్రంలో హుజురాబాద్ పాలిటిక్స్ గురించి చ‌ర్చ జ‌రుగుతుంది. ఇదే క్ర‌మంలో మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలో అధికార, విప‌క్ష నేత‌ల మ‌ధ్య జ‌రుగుతున్న మాట‌ల యుద్దం తారాస్తాయికి చేరుకుంది. నువ్వా - నేనా అన్న‌ట్టు మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి, కోమ‌టి రెడ్డి బ్ర‌ద‌ర్స్ మ‌ధ్య మాట‌ల వార్ కొన‌సాగుతుంది. ఇది చివ‌రికి మునుగోడు ఎమ్మెల్యే రాజ‌గోపాల్ రెడ్డి అరెస్ట్ వ‌ర‌కు చేరింది. దీనికి స్పందించిన ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి ఈ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు.

  కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌ను అక్ర‌మంగా అరెస్ట్ చేస్తున్నార‌ని తెలిపారు. మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి సీఎం కేసీఆర్ పేరు చెప్ప‌కుని వేల కోట్లు దండుకున్నారని ఆరోపించారు. ఈటల రాజేందర్‌కు పట్టిన గతే త్వరలో జగదీశ్‌రెడ్డికి పడుతుందని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జోస్యం చేప్పారు.  అయితే.. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై కౌంటర్‌ అటాక్ చేస్తున్నారు మంత్రి జగదీశ్‌రెడ్డి. కృష్ణా నదిలో నల్గొండ నీళ్ల వాటాలను అమ్ముకుని డబ్బులు సంపాదించారంటూ కోమటిరెడ్డి బ్రదర్స్‌పై నిప్పులు చెరిగారు మంత్రి. తాము కాంగ్రెస్‌ నాయకులం కాదని.. జానారెడ్డి, ఉత్తమ్‌రెడ్డి వాల్ల లాగా నోటికి భయపడేది లేదని తేల్చి చెప్పారు. తాను ఇంతవరకూ ఎవరి జోలికి వెళ్లలేదన్న మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి ఎక్కువ మాట్లాడితే బట్టలు విప్పుతానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.


మునుగోడులో రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమానికి వెళ్తున్న మంత్రి జగదీశ్‌ రెడ్డి కాన్వాయ్‌ను మునుగోడు చౌరస్తాలో కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జ‌రిగింది. అటు మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వస్తున్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిని అవుటర్‌ రింగ్‌ రోడ్డు దాటిన తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ‌తం నుంచే మంత్రి వర్సస్‌ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. నియోజ‌క‌వ‌ర్గానికి 2 వేల కోట్ల రూపాయ‌లు ఇస్తే త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని ఇటీవ‌ల ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది తెలిసిన విష‌య‌మే.


మరింత సమాచారం తెలుసుకోండి:

trs