తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ఢిల్లీ పర్యటన ఇంకా కొనసాగుతూనే ఉంది.   గత శుక్రవారం సాయంత్రం ఢిల్లీ కి వచ్చిన సీఎం కేసిఆర్...  నాలుగు రోజులుగా ఢిల్లీ పర్యటన లో ఉన్నారు.   ముగ్గురు కీలక కేంద్ర మంత్రులను కలిసిన సీఎం కేసిఆర్...   కేంద్ర హోమ్, కేంద్ర జలశక్తి, కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ మంత్రులను ఇప్పటికే కలిశారు.  కేంద్ర హోమ్ మంత్రి అమిత్‌ షాను  రెండు సార్లు విడిగా కలిసిన సీఎం కేసీఆర్‌...  కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తో రెండు సార్లు  భేటీ కావడం గమనార్హం. 

ఇక గత శనివారం, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్  తో సుదీర్ఘం గా చర్చలు జరిపిన ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు. తెలంగాణ లో సాగునీటి ప్రాజెక్టులు, పలు రకాల అనుమతుల మంజూరు పై నెలకున్న సందిగ్ధత, రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు పై సుదీర్ఘంగానే  చర్చలు జరిపారు సీఎం కేసీఆర్‌. కొత్త రాష్ట్రం, ప్రజల ఆశలకు అనుగుణంగా, వెనుకబడిన ప్రాంతాలను వేగంగా అభివృద్ధి చేసుకోవాల్సిన ఆవశ్యకతను కేంద్ర మంత్రికి వివరించారు  ముఖ్యమంత్రి కేసీఆర్.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కు త్వరితగతిన పూర్తి చేసుకునేందుకు కేంద్ర సహకారం కావాలని కోరారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. ఇక ఆదివారం, “వామపక్ష తీవ్రవాద ప్రభావం” ఉన్న 10 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం లో పాల్గొన్న తెలంగాణ సీఎం కేసిఆర్... అదే రోజు రాత్రి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తో  ఒక గంట 45 నిముషాల పాటు సమావేశమయ్యారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. బహుశా, ఈ రోజు ( మంగళవారం) కూడా సీఎం కేసీఆర్‌ ఢిల్లీ లోనే ఉండే అవకాశాలున్నాయని సమాచారం అందుతోంది. దొండు బియ్యం ఇతర సమస్యలపై పరిష్కారం దక్కేంత వరకూ అస్సలు తగ్గేదేలే అన్నట్లు గా వ్యూహాలు రచిస్తున్నారు కేసీఆర్‌.
 


మరింత సమాచారం తెలుసుకోండి: