కొణిజేటి రోశయ్య, ఆగష్టు 31, 2011 నుండి 30 ఆగష్టు, 2016 వరకు 18వ తమిళనాడు గవర్నర్ గా బాధ్యతలు నెరవేర్చారు. ఆయనకు ఉన్న సుదీర్ఘ రాజకీయ అనుభవం చేత అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఆయనకు తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్ గా నియమించింది. అప్పటికే ఆయన 15 వ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, అలాగే 17వ కర్ణాటక గవర్నర్ గా కూడా అనుభవం ఉండటం చేత కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆయనకు రాజకీయాలలో ఉన్న అనుభవం చేతను, ఆయన ఆయా పరిస్థితులను చక్కదిద్దటం లోను, ఇతరులతో విషయాలను చక్కబెట్టడం లోను ఉన్న పరిణతిని కాంగ్రెస్ పార్టీ గురించడం తో తమిళనాడుకు గవర్నర్ గా పదవి బాధ్యతలు ఆయనకు అప్పజెప్పింది.

అప్పటికే తమిళనాడులో అధికారంలో ఉన్న జయలలిత ప్రభుత్వంతో అయన కలిసి పనిచేయాల్సి వచ్చింది. సాధారణంగా ఇక్కడ కాస్త ప్రభుత్వానికి, గవర్నర్ లకు మధ్య ఏదైనా పొరపొచ్చాలు ఉండే అవకాశాలు ఉంటాయి. ఇప్పట్లో అయితే అవన్నీ సర్వసాధారణం. కానీ అలాంటివి రోశయ్య పదవిలో ఉన్నంతకాలం లేకుండానే సజావుగా గడిచిపోవడం జరిగింది. దీనిని బట్టి ఆయన హుందాతనం అర్ధం చేసుకోవచ్చు. తనను జయలలిత గారు పెద్దాయన అని పిలిచేదని, సాధారణంగా ఎప్పుడు కూడా ప్రభుత్వం  గవర్నర్ మధ్య ఆయా విషయాల వలన ఎటువంటి బేధాభిప్రాయాలు వచ్చిందే లేదని ఆయన స్వయంగా తన అభిప్రాయాన్ని పంచుకోవడం కూడా జరిగింది.

ఇలా తన సుదీర్ఘ రాజకీయ అనుభవం చేత తనకు అధిష్టానం ఇచ్చిన బాధ్యతలను స్పష్టంగా నిర్వర్తించడంలో ఆయనకు ఆయనే సాటి. రవాణా, గృహ నిర్మాణ, వాణిజ్య, పన్ను, హోమ్ శాఖలలో ఆయన తన బాధ్యతలు నిర్వర్తించారు. కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య విద్య, విద్యుత్ శాఖల మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఒక్క ఏపీ కి సంబంధించి ఆయన 15 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో కూడా ఆర్థిక మంత్రిగా ఆయన తన బాధ్యతలు నిర్వర్తించారు. ఏపీ పీసీసీ అధ్యక్షులుగా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. ఇలా ఎన్నో మైలు రాళ్లు ఆయన రాజకీయ ప్రస్థానంలో, కాంగ్రెస్ మరో సీనియర్ నేతను కోల్పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: