ఏ రాజకీయ పార్టీలో ఆయన ఎంత గొప్ప నాయకుడు అయినా ? ఎంత తిరుగులేని నాయకుడు అయిన కొన్ని సందర్భాల్లో వెనక్కు తగ్గక తప్పదు. ఎలాంటి నేతలు ఆయన ప్రజల్లో వ్యతిరేకత మొదలైనప్పుడు దాని తగ్గించుకోవటానికి నాలుగు అడుగులు వెనక్కి వేయాల్సిందే. తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం ఇప్పుడు తన పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న విషయాన్ని గుర్తించి ... ఆయన కూడా నాలుగడుగులు వెనక్కి వస్తున్న పరిస్థితి ఉంది. కెసిఆర్ సాధారణంగా ఏ విషయంలో ఆయన ఐ డోంట్ కేర్ అన్నట్లుగా ఉంటారు. అయితే ఇటీవల జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నిక ఓటమి కేసీఆర్ పై తీవ్రమైన ప్రభావం చూపించిందని అంటున్నారు.

ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు కెసిఆర్ సర్వశక్తులు ఒడ్డారు. మంత్రి హరీష్ రావు ను ఈ ఉప ఎన్నికకు ఇన్ఛార్జిగా నియమించడంతో పాటు కోట్లాది రూపాయలు ధారపోశారు. భారత దేశంలోనే ఎక్కడా లేని విధంగా దళిత బంధు పథకాన్ని ఈ నియోజ‌క‌వ‌ర్గంలోని వాసాల‌మ‌ర్రి లో తెరమీదకు తీసుకువచ్చారు. అయితే కేసీఆర్ లెక్క ఘోరంగా తప్పింది. కేసీఆర్ చెబితే ఓట్లు ఎప్పుడూ రాల‌వ‌న్న విష‌యం ఆయనకు అర్థం అయింది. దీంతో ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో తన పాలన ఎలా ఉంది ? 2023 లో ఎన్నికలు జరిగితే ఎలా ఉంటుంది ? ఒకవేళ ముందస్తు ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుంది.. అన్న విషయంపై ఆయన సర్వేలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్‌ సంస్థతో టిఆర్ఎస్ అధిష్టానం డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ సంస్థ ప్రతినిధులు ప్రగతి భవన్లో కేసీఆర్ తో సమావేశం అయినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. కెసిఆర్ సాధారణంగా ఇలాంటి సర్వేలపై తక్కువగా ఆధారపడతారు. ఎంత వరకు తాను తీసుకున్న నిర్ణయాలు ... తన పాలనే తన‌ను ఎప్పుడు గెలుస్తుంది అని అనుకుంటారు. అయితే దుబ్బాక తోపాటు హుజురాబాద్ - గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిఆర్ఎస్ కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూ ఉండ‌డం తో కేసీఆర్ ఇప్పుడు తన పాలన పై తన నిర్ణయాలపై .. పునరాలోచన దిగినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: