ఒక గొప్ప గా తనకు తాను చెప్పుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి ఇమ్రాన్ ఖాన్. కానీ వాళ్ల దేశంలో ఎక్కువగా నిరక్షరాస్యులు, అజ్ఞాతవాసులు ఎక్కువ. అలాగే అజ్ఞానంతో మతం పిచ్చి ఉండేవారు మరీ ఎక్కువగా ఉండేవారు ఉన్నారు కాబట్టి బ్రతికి పోతున్నాడు. కానీ ఇవ్వాళ సోషల్ మీడియాలో ప్రపంచం మొత్తం ఒక్కొక్కటి పోస్టుమార్టం చేసి చూపిస్తోంది. దీంతో ఏ ఒక్క వ్యక్తి తక్కువ తిన్నాడు ఏం కాదు. దీనికి సమాధానం వెతకడానికి సకల కారణాలు  వెతుకుతూ ఉంటారు. ఈ అన్వేషణలో పాకిస్థాన్ బతుకు బస్టాండ్ అయిపోతుంది. కానీ ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ తాజాగా నేను భారత్తో వందేళ్ల శాంతిని కోరుకుంటున్నానని  చెప్పడం విడ్డూరంగా ఉంది. దీన్ని బట్టి చూస్తే  భారత్ ఎప్పుడైనా జమ్మూ కాశ్మీర్లో శాంతిభద్రతలు ఎప్పుడైనా చెడగొట్టిందా.. పాకిస్తాన్ వెళ్లి ఆఫ్ఘనిస్తాన్ వెళ్లి పెట్టిందా భారత్ వెళ్లి వేలు పెట్టిందా..

ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. ఎప్పుడూ ఆర్థికంగా ఎదుగుదల కోసం భారత్లో చేతులు కలపడం జరుగుతూ వస్తోంది. రెండో విషయానికి వస్తే పాకిస్తాన్లో గనుక భారీగా పెట్టుబడులు పెడితే, పెట్టినవారికి పాకిస్తాన్ పౌరసత్వం ఇస్తానని చెప్పడం చాలా విచిత్రం. ఇందులో రెండు దేశాల వారిని టార్గెట్ చేశాడు. భారతదేశంలోని సిక్కులు, అలాగే ఆఫ్ఘనిస్తాన్  లోని ధన వంతులు అయినటువంటి వ్యక్తులపై కన్నేశారు.  ఎందుకంటే వారు ఆఫ్ఘనిస్తాన్లో  స్థానంలో బ్రతక లేక పోతున్నారు. ఎంత డబ్బు ఉన్నా అక్కడ కనీసం తినడానికి గోధుమలు కూడా కొనుక్కోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో వారు ఆ డబ్బులు తీసుకొచ్చి పాకిస్తాన్లో పెట్టుబడి పెడితే అక్కడ వ్యాపారాలు చేసుకోవచ్చు.. దర్జాగా ఉండొచ్చని ఆలోచనలు కలిగిస్తున్నారు. అలాగే అలా వచ్చే వారికి పాకిస్తాన్ పౌరసత్వాన్ని చివరికి సెక్యూరిటీ కలిగిస్తామని చెబుతున్నారు.

రెండవది సిక్కులలో ఎవరైతే కలిస్తాని  ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్నారో వారికి షెల్టర్ ఇవ్వడం, అంటే దీని అర్థం ఇక్కడ అరాచకాలు చేసి సంపాదించిన డబ్బుతో అక్కడ పెట్టుబడులు పెట్టి ఆనందంగా బతకాలని చెప్పేసి వారికొక ఆలోచన కల్పించడం దుర్మార్గమైన ఆలోచన అని చెప్పవచ్చు. కానీ అక్కడికి వెళ్ళాక వీడిని పాకిస్తాన్ ఐ ఎస్ ఐ వాడో లేక ఇంకెవరైనా ఆల్ఖైదా కు సంబంధించిన వ్యక్తులు వీడి దగ్గర ఉన్న డబ్బంతా దోచి చివరికి వీడిని అక్కడే జైల్లో పడే అవకాశం ఏర్పడవచ్చు. మొత్తానికి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆలోచనైతే ఇదే అని క్లియర్ గా చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: