
ఇంతకీ ఎవరా ఉద్యోగులు అంటారా.. వాళ్లే ఏపీ ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు. జగన్ సర్కారు ఇప్పుడు వీరి జీతాలు పెంచింది. కొత్త వేతనాల ప్రకారం.. వీరికి కనీస వేతనం పదిహేను వేల రూపాయలుగా ఉండే అవకాశం ఉంది. ఈ ఔట్ సోర్సింగ్ వేతనాల పెంపు ప్రభావం కారణంగా ప్రభుత్వం దాదాపు ఎనిమిది వందల కోట్ల భారం పడుతుందట. ఈ మేరకు నిపుణులు అంచనా వేశారు. ఇలాంటి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు లక్ష మందికి వరకూ ఏపీలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వారివారి కేటగిరీల వారీగా జీతాలు పెరిగాయి. ఆ వివరాల్లోకి వెళ్తే.. కేటగిరి 1కు పెరిగిన నెల వేతనం రూ. 21,500గా ఉంది. ఈ కేటగిరీ కిందకు సీనియర్ అసిస్టెంట్, సీనియర్ స్టెనో,సీనియర్ అకౌంటెంట్, ట్రాన్స్లేటర్,డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ వ్తారు. అలాగే కేటగిరి 2 ఉద్యోగస్తులకు పెరిగిన నెల వేతనం రూ. 18,500గా ఉంది. ఈ కేటగిరీలో డ్రైవర్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ స్టెనో, టైపిస్ట్, టెలిఫోన్ ఆపరేటర్, స్టోర్ కీపర్, ఫొటోగ్రాఫర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, మెకానిక్, ఫిట్టర్, లైబ్రేరియన్, ల్యాబ్ అసిస్టెంట్, సూపర్వైజర్, మేనేజర్ వంటి వారు వస్తారు.
కేటగిరి 3 వారికి పెరిగిన నెల వేతనం రూ. 15,000గా ఉంది. ఈ కేటగిరీలోకి ఆఫీస్ సబార్టినేట్, వాచ్మెన్, కుక్, వాచ్మెన్, కుక్ చౌకీదార్, సైకిల్ ఆర్డర్లీ, లిఫ్ట్ ఆపరేటర్, ల్యాబ్ అసిస్టెంట్, దఫేదార్, జిరాక్స్ ఆపరేటర్, రికార్డ్ అసిస్టెంట్ వంటి ఉద్యోగులు వస్తారు. ఈ పెంపుతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మాత్రం సంతోషంగా ఉన్నారు.