చుండ్రు పట్టిందంటే చాలు జుట్టు ఎదుగుదల కూడా తగ్గుతుంది. చుండ్రు తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. చుండ్రు వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. చుండ్రు ఎందుకు వస్తుంది అనేది తెలుసుకుని, ఈ పొరపాట్లు నుంచి ఉపశ్రమమం పొందావచ్చు. ఈ నేపథ్యంలో చుండ్రు రావడానికి గల కొన్ని కారణాలు ఉన్నాయి. ఒమేగా 3 ఫ్యాటి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఒకవేళ మీ బాడీలో ఒమేగా-3 ఫ్యాటి చుండ్రు సమస్య పెరుగుతుంది. దీనిని నివారించేందుకు ఒమేగా-3 ఎక్కువగా గల సాల్మోన్, మారెల్ వంటి కొవ్వు చాపలతో పాటు అవకాడో, వాల్ నట్స్ వంటివి తినడం మేలు. విటమిన్ బి6, బి12 తక్కువగా ఉండే జుట్టు పాడవుతుంది. స్కిన్ డ్రై అయిపోతుంది.

ప్రోటీన్ తక్కువగా ఉంటే కూడా చుండ్రు సమస్యతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. చర్మ సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ప్రోటీన్ లోపం లేకుండా చూసుకోండి. పదేపదే షాంపూ తో రుద్దడం, హర్ష్ షాంపూలతో తల స్నానం చేయడం వల్ల కుదుళ్ళు పొడిబారి పోతాయి. దీంతో ఇన్ఫెక్షన్స్ ఏర్పడి చుండ్రు, దురద వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. జుట్టు సంరక్షణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వారంలో రెండు సార్లు తలకు గోరువెచ్చని నూనెతో మసాజ్ చేయడం మంచిది. సరిపడా నీళ్లు తాగకపోవడం వల్ల చర్మ సమస్యలు వస్తాయి. జుట్టు కూడా పాడవుతుంది. చుండ్రు కూడా ఎక్కువగా పెరుగుతుంది. అందుకే రోజుకు కనీసం 3-5 లీటర్ల నీళ్లు తాగాలి. ఒత్తిడి, హార్మోన్ సమతుల్యత వల్ల ఆయిల్ ఉత్పత్తి పై నెగిటివ్ ప్రభావం పడుతుంది.

చర్మ సమస్యలతో  పాటుగా చుండ్రు సమస్యను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. చర్మం తేమ కోల్పోయి పొడిబారినప్పుడు చుండ్రు ఎక్కువగా కనిపిస్తుంది. వింటర్ సీజన్లో ఇది ఎక్కువగా కనిపించవచ్చు. తక్కువ నీరు తాగడం వల్ల కూడా చర్మం పొడిగా మారుతుంది. కొంతమందిలో తలపై అధికంగా నూనె ఉత్పత్తి అవుతుంది. అధిక నూనె వల్ల ఫంగస్ పెరిగి చుండ్రు ఎక్కువవుతుంది. ఇది కేవలం తలకే కాకుండా చెంపలు, చెవులు, మడమలు వంటి ప్రాంతాల్లో కూడా ప్రభావం చూపించవచ్చు. తల చర్మంపై సహజంగా ఉండే మాలస్సేజియా అనే ఫంగస్ ఎక్కువగా వృద్ధి చెందితే చుండ్రు పెరుగుతుంది. ఇది చర్మ కణాలను వేగంగా మృత కణాలుగా మార్చి ఊడిపోయేలా చేస్తుంది. తల మురికి, చెదురు, చర్మ మృత కణాలు పేరుకుపోతే చుండ్రు ఎక్కువగా కనిపిస్తుంది. తల శుభ్రంగా ఉంచకపోవడం వల్ల బాక్టీరియా, ఫంగస్ పెరుగుతాయి. శక్తివంతమైన కెమికల్స్ ఉన్న షాంపూలు తల చర్మాన్ని దెబ్బతీసి పొడిపింపచేస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: