ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో వెలుగు వెలిగిన వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఊహించని విధంగా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. రాబోయే రోజుల్లో అయినా ఈ పార్టీ పుంజుకుంటుందా అనే ప్రశ్నకు సరైన సమాధానం దొరకడం లేదు. మరో ఏడాది పాటు వైసీపీ నేతలకు ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. వైసీపీలో చేరాలంటే నేతలు భయపడేలా కూటమి ప్రణాళికలు ఉన్నాయని సమాచారం అందుతోంది.
 
వైసీపీ నేతలకు ఒక సమస్య తీరిందని భావించే లోపు మరో సమస్య వేధిస్తోంది. పార్టీకి గుడ్ బై చెప్పిన నేతలను సైతం వైసీపీ వదిలే పరిస్థితి కనిపించడం లేదు. పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చే విషయంలో జగన్ సైతం పూర్తిస్థాయిలో ఫెయిల్ అయ్యారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ మళ్లీ సీఎం కాకుండా అడుగులు వేసేలా కూటమి అడుగులు వేస్తుండటం ఒకింత సంచలనం అవుతోంది.
 
జగన్ అధికారంలో ఉన్న సమయంలో ఊహించని స్థాయిలో అవినీతి జరిగిందని ప్రూవ్ చేయడానికి కూటమి ప్రయత్నిస్తోంది. కూటమి సర్కార్ మరో ఏడాది వరకు సంక్షేమ పథకాల విషయంలో ఒకింత ఆచితూచి వ్యవహరించనుందని భోగట్టా. అయితే కూటమి సర్కార్ ఈ విధంగా చేయడం వల్ల కొంతమేర ప్రజా వ్యతిరేకత పెరిగే అవకాశం ఉన్నా ఆ చర్చ ప్రజల్లో జరగకుండా వైసీపీ టార్గెట్ గా ఏపీలో రాజకీయాలు సాగుతున్నాయని చెప్పాలి.
 
ఒకింత నిదానంగా పథకాల అమలు జరిగేలా కూటమి ప్రణాళికలు ఉన్నాయని 2027 నుంచి పూర్తి స్థాయిలో పథకాలను అమలు చేయాలని కూటమి సర్కార్ భావిస్తోందని సమాచారం అందుతోంది. అమరావతిని వేగంగా పూర్తి చేయడానికి కూటమి ప్రాధాన్యత ఇవ్వనుంది. 2029 నాటికి పూర్తిస్థాయిలో సంక్షేమ పథకాలు అమలయ్యేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని తెలుస్తోంది. మాజీ సీఎం  జగన్ ఏదో ఒక కొత్త నిర్ణయంతో ముందడుగులు వేస్తే మాత్రమే ఈ పరిస్థితి మారే అవకాశాలు అయితే ఉంటాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: