
విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ .. ఏపీ పిల్లల భవిష్యత్ ను ఎంతో ప్రణాళికా బద్ధంగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. లోకేష్ సంస్కరణలు ... యేడాది కాలంలోనే గతంలో గాడి తప్పిన వ్యవస్థను గాడిన పెట్టే ప్రయత్నం చేశారు. గత ప్రభుత్వం చాలా ఫూలిష్ నిర్ణయాలు తీసుకుంది. ఎలాంటి కసరత్తు లేకుండా సీబీఎస్ఈ, ఇంగ్లిష్ మీడియాం, ఐబీ అంటూ పిల్లలపై ఒత్తిడి చేసేలా చేశారు. ఇక రంగుల కోసం వేల కోట్లు ఖర్చు పెట్టారు. ఒక్క టీచర్ ను నియమించలేదు. అసలు గత ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా తీయలేదు. అయితే లోకేష్ ఈ పరిస్థితి పూర్తిగా మార్చేందుకు తొలిరోజు నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టి యేడాదిలోనే మంచి ఫలితాలు సాధిస్తున్నారు.
క్షేత్రస్థాయిలో టీచర్ల వల్లే స్కూళ్లు మెరుగు పడతాయని భావించి మార్పులు చేశారు. ప్రభుత్వ స్కూళ్లలోకి విద్యార్థులు వెళ్లాలంటే ఏం చేయాలో అధ్యయనం చేశారు. అందుకు అనుగుణంగా కార్యాచరణ అమలు చేశారు. ప్రత్యేకంగా కొందరు ఆదర్శ ఉపాధ్యాయులను పిలిచి వారి సలహాలు తీసుకున్నారు. ఉపాధ్యాయులపై భారం తగ్గించారు. విద్యార్థులకు అందించే సామగ్రిపై రాజకీయ నాయకుల ఫోటోలు లేదా పార్టీ రంగులు ఉండకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రభుత్వ విద్యను కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లేలా లోకేష్ చాలా కష్టపడ్డారు. 16,000 కంటే ఎక్కువ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి మెగా డీఎస్సీ ఇచ్చారు. ఓవరాల్ గా ఏపీ విద్యాశాఖలో నారా లోకేష్ ముద్ర చాలా స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు