- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . . .

రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన అవకాశాలు వస్తాయా అంటే కష్టమే అని చెప్పాలి. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న చాలా కుటుంబాలకు చెందిన వారసులు టిక్కెట్లు తెచ్చుకోవడంలోనూ .. టిక్కెట్లు తెచ్చుకున్న గెలుపు గుర్రం ఎక్కటంలో ను .. ప్రజల ఆదరణ పొందటంలోనూ విఫలం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో చాలామంది వారసుల టార్గెట్ 2029 ఎన్నికలు. మరి రాజకీయంగా తడబడుతున్న ఆ వారసులు ఎవరో చూద్దాం.
పరిటాల శ్రీరామ్ :
నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. 2019 ఎన్నికలలో తొలిసారి రాప్తాడు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికలలో ధర్మవరం సీటు ఆశించిన రాలేదు. వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యేగా విజయం సాధించాలని శ్రీరామ్ ఆశలు పెట్టుకున్నారు.
దేవినేని అవినాష్ :
పలు పార్టీలు మారిన నియోజకవర్గం మారుతున్న రాజకీయంగా గెలుపు గుర్రం ఎక్కటంలో అవినాష్ తడబడుతున్నారు. కాంగ్రెస్ నుంచి టిడిపి తర్వాత వైసిపి లో ఉన్న అవినాష్ మూడు నియోజకవర్గాలలో పోటీ చేసిన మూడు పార్టీల నుంచి గెలుపు గుర్రం ఎక్కలేకపోయారు.


నేదురిమిల్లి రామ్ కుమార్ రెడ్డి :
నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మాజీ ముఖ్యమంత్రి నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి - మాజీ మంత్రి రాజ్యలక్ష్మి వారసుడు రాంకుమార్ గత ఏడాది వైసిపి నుంచి వెంకటగిరిలో పోటీ చేసి ఓడిపోయారు.
కావలి గ్రీష్మ :
మాజీ స్పీకర్ కావాలి ప్రతిభ భారతి కుమార్తెగా రాజకీయాలలోకి వచ్చిన గ్రీష్మ గత ఎన్నికలలో టిక్కెట్ ఆశించిన దక్కలేదు. చంద్రబాబు దయతో మండలి లోకి వచ్చిన మనసు మాత్రం ఎమ్మెల్యే టికెట్ మీదే ఉందని తెలుస్తోంది. వంగవీటి రాధా :
వంగవీటి రంగా వారసుడుగా రాజకీయాలకు వచ్చిన రాధా 2004లో గెలిచి సింగిల్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోయారు. ఆ తర్వాత ఎన్ని పార్టీలు మారినా .. ఎన్నిసార్లు పోటీ చేసిన గెలుపు గుర్రం ఎక్కలేకపోతున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: