ముఖ్యమంత్రిగా  'వై ఎస్ జగన్' తీసుకుంటున్న  సంచలనాత్మక  నిర్ణయాలు ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారుతున్నాయి. మొదట్లో జగన్ దూకుడు చూసి కొత్తలో అలాగే ఉంటుందిలే అనుకున్నారు అంతా. కానీ జగన్ ప్లాన్ లు.. ఆర్ధికపరమైన లావాదేవీల గురించి జగన్ కున్న అవగాహన చూస్తుంటే.. టీడీపీ వాళ్ళకి  మైండ్ పని చేయట్లేదట. అందుకే జగన్ ప్రభంజనంలో తమ ఉనికిని కాపాడుకోవటానికి బాబు నానా హంగామా చేస్తున్నారని వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా  టీడీపీ ఓ వైపు హింసా రాజకీయాలకు పాల్పడుతూనే వైయస్‌ఆర్‌ సీపీ పై బురదజల్లుతోందని..   వైయస్‌ఆర్‌సీపీ నేతల పై కార్యకర్తల పై  దాడులు చేస్తూనే,  తమ పై దాడులు జరుగుతున్నాయంటూ చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని...  పెయిడ్‌ ఆర్టిస్టులు, టీడీపీ దొంగలతో డ్రామాలు ఆడించి రాష్ట్రంలో లేని శాంతి భద్రతల సమస్యను సృష్టించాలని బాబు కుట్రలు చేస్తున్నారని.. మొత్తంగా పల్నాడులో టీడీపీ ఖాళీ అయిపోతుందని వైసీపీ వాళ్ళు కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు.  ఇక టీడీపీ జెండా కట్టే నాయకుడు కూడా లేడనే చంద్రబాబు కొత్త నాటకం తెరతీశాడని అంటున్నారు వైసీపీ నాయకులు. 

  

అయితే జగన్ మాత్రం  తను ఎన్నికల  సమయంలో ఇచ్చిన నవ రత్నాల హామీల పైనే దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది.  అందుకే సీఎం అయినా మొదటి రోజు నుండి నవ రత్నాల మీద ఫోకస్ పెట్టాడు జగన్. అందులో భాగంగా మొదట గ్రామ వాలంటీర్ వ్యవస్థని ఏర్పాటు చేశాడు.   అది ఏర్పడిన తర్వాత తమ పధకాలు నేరుగా ప్రజల్లోకి  వెళ్లేలా చేయటానికి సరికొత్త ప్లాన్ సిద్ధం చేశాడు.  మొత్తానికి  తాను ఇచ్చిన నవ రత్నాలు హామీలను నెరవేర్చేదాకా వెనకడుగు వేసేది లేదన్నట్లు జగన్ దూసుకొనిపోతున్నాడు. ఇప్పటికే  నవరత్నాల హామీను ఆచరణలో పెట్టబోతున్న  జగన్.. ఇంకా అదనపు హామీల కోసం కూడా  అహర్నిశలు శ్రమిస్తున్నాడు.   సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా  జగన్  టీడీపీని మరియు బాబును ముప్పుతిప్పలు పెడుతున్నాడు.  ఏమైనా జగన్  దూకుడు ముందు  నలభై ఏళ్ల అనుభవం ఉన్న బాబు కూడా ప్రేక్షక పాత్ర వహించాల్సి వస్తోంది. అయితే జగన్ ఇచ్చిన నవ రత్నాలను పక్కాగా అమలు చేస్తే మాత్రం  ఇక జగన్ కి  సీఎంగా తిరుగుండదు.   


మరింత సమాచారం తెలుసుకోండి: