ఒకానొక ఊర్లో రహీమ్ అనే దర్జీవాడు ఉండేవాడు. అతను దుస్తులు బాగా కుట్టడం వల్ల అతని దుకాణం ఎప్పుడూ జనాభాతో నిండి ఉండేది. ఇక అదే ఊరిలోనే పెద్ద దేవాలయం కూడా ఒకటి ఉండేది. గుడి దగ్గర ఒక ఏనుగు కూడా ఉండేది. ఇక ఆ ఏనుగు మీద దేవుళ్ళ విగ్రహాలను పెట్టి పండుగరోజు పర్వదినాలలో ఊరంతా ఊరేగించే వాళ్ళు.

ఇక ఏనుగు ప్రతిరోజూ స్నానం చేయడానికి రహీమ్ బట్టల దుకాణం ముందు నుండి వెళ్తూ ఉండేది. ఇక అలా రహీంకు ఆ ఏనుగుతో చక్కని అనుబంధం ఏర్పడింది. ఇక రహీమ్ ప్రతి రోజు ఆయనకు ఏదో ఒక పండు కానీ , చెరుకు ముక్క గాని ఇస్తూ ఉండేవాడు. ఇక ఆయనకు బాగా అలవాటు పడిపోయి ప్రతిరోజూ ఆ దుకాణం ముందు వచ్చి నిలబడేది ఆ ఏనుగు. ఇక రహీం ఆ ఏనుగుకు ఏదో ఒకటి ఇచ్చిన తర్వాతనే ఆ ఏనుగు అక్కడి నుండి బయలుదేరేది.

ఒకరోజు రహీం ఎందుకో తనకు ఖాతాదారులతో గొడవ పడ్డాడు. ఇక ఆ రోజు అతని మనసు ఏమి బాగోలేదు. పాపం ఈ విషయం ఏనుగుకు తెలియదు కదా! ఎప్పటిలాగే రహీం దుకాణం ముందు వచ్చి నిలబడింది. ఇక ఎంతసేపటికీ రహీం దానికి ఏది ఇవ్వకపోయేసరికి, రహీమ్ తనను చూడలేదు అనుకుని గట్టిగా ఘీంకరించింది. ఇంకా అప్పటికే చికాకు లో ఉన్న రహీం దాని శబ్దాన్ని విని, మరింత చికాకు పడిపోయి వెంటనే సూది తీసుకొని, దాని చెవి మీద గట్టిగా గుచ్చాడు. ఇక పాపం చాలా బాధ కలిగిన ఏనుగు అక్కడి నుండి వెళ్ళిపోయింది.


ఏనుగు నదిలో స్నానం చేస్తూ , రహీమ్ కు ఎలాగైనా బుద్ధి చెప్పాలని ఒక ఆలోచన కూడా చేసింది. ఇక అక్కడ ఉన్న బురద నీటిని తన తొండెం నిండా పీల్చుకొని రహీం దుకాణ ముందుకు వచ్చి, తన దుకాణానికి వచ్చిన కొత్త బట్టల పైన, తన పైన కుమ్మరించి వెళ్ళిపోయింది. ఇక తను చేసిన పనికి ఏనుగుకు కోపం వచ్చిందని రహీమ్ గ్రహించాడు. ఇక ఆ తరువాత రోజు నుండి తనతో స్నేహం చేయాలని ,రహీం దానికి చాలా పండ్లు, చెరుకు గడలు తీసుకొచ్చి పెడుతూ ఉండేవాడు. ఇక ఏనుగుతో స్నేహం చేయాలని ఎన్నో విధాల ప్రయత్నం చేసినప్పటికీ, ఆ ఏనుగు తనతో స్నేహం చేయడం మానేసింది. ఇక చేజేతులారా చక్కటి స్నేహాన్ని వదులుకున్నానని ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు రహీం. కాబట్టి అమాయకుల పైన మన కోపతాపాలను ఎప్పటికీ చూపించరాదు.


మరింత సమాచారం తెలుసుకోండి: