మన నాడీ వ్యవస్థలో ముఖ్యంగా రెండు బాగాలుంటాయి. సహనుభూతి నాడీ వ్యవస్థ(sns) పరసహానుభూతి నాడీ వ్యవస్థ (PNS). వీటిల్లో మొదటిది మన శారీరక ప్రతిచర్యలను పెంచడానికి ఉపయోగపడుతుంది. స్ట్రెస్ ఏర్పడినపుడు, ఆదాడిని ఎదుర్కొనే నేపధ్యంలో పోరాడ్డం, లేదా పారిపోవడం ఏదో ఒకటి చేయడానికి మన శరీరానికి సిద్దపరిచే క్రమంలోsns వ్యవస్థ మన శారీరక పనితీరును వేగవంతం చేస్తుంది. రక్త ప్రసరణ అధికం చేయడం, కండరాలకు అధిక బలాన్ని అందివ్వడంవంటి చర్యల ద్వారా, శరీరం తనంతట తాను బహిర్గత ప్రమాదకర పరిస్థితుల నుండి కాపాడుకునేలా చేస్తుంది. కాగా ఆ ప్రమాదకర పరిస్థితుల నుండి కాపాడుకునేలా చేస్తుంది. కాగా ఆ ప్రమాదకర పరిస్థితి తొలగిపోగానే, మన శరీరంలో యధాస్థితి నెలకొనడానికి వీలుగా, తగిన చర్యలను చేపట్టడానికి pns వ్యవస్థ ఉపయోగపడుతుంది. PNS నాడీ వ్యవస్థ మన జీవక్రియలను కాపాడుతుంది. గుండె సవ్యంగా కొట్టుకోవడం, ఆహారం జీర్ణం కావడం వంటి మౌళిక చర్యలను pns అదుపులో వుంచుతుంది. ఇది మన ఇతర శారీరక చాలక క్రియలను తగ్గించి, శక్తిని నిల్వవుంచి, జీవక్రియలకు వెచ్చిస్తుంది. అందువల్లే ఈ వ్యవస్థ చక్కగా పనిచేసినపుడు మనం చక్కగా రిలాక్స్ అవుతాం. లేదా మనం చక్కగా రిలాక్స్ కావడం ద్వారా ఈ నాడీ వ్యవస్థను చక్కగా పనిచేసే విధంగా చేయవచ్చు. చక్కని, శృంగార ప్రణయ రసక్రీడ వల్ల మనం పొందే మానసిక అనుభూతి, ప్రశాంతత ఆహ్లాదకర బావనలు రిలాక్సేషన్ లు ఇవన్నీ పరోక్షంగా మన pnsను ఉత్తేజపరిచి, మన మౌళిక జీవనక్రయలు సవ్యంగా జరిగేలా చేయవచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: