
కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన తిరుమల గిరులు భక్తులతో కిటకిట లాడుకున్నాయి. ఒక వైపు మంచు కురుస్తున్నా, భక్తుల గోవింద నామస్మరణలతో తిరుమల క్షేత్రం వర్ణించలేనంత వైభవంగా ఉంది. మరికొద్ది గంటల్లో తిరమలేశుుడు వైకుంఠ ద్వారం నుంచి భక్కులకు దర్శనమివ్వనుండటంతో భారీగా కాకున్నా, పెద్ద సంఖ్యలోనే భక్తులు విచ్చేశారు. చాలా ప్రముఖులు కూడా తిరమలలో స్వామి వారి దర్శనార్థం ఉన్నారు. ప్రస్తుతం శ్రీనివాస మహా ప్రభువుకు ధనుర్మాస కైంకర్యాలు జరుగుతున్నాయి. స్వామివారికి వేకువ ఝాము పూజాధికారు పూర్తి చేసి భక్తులకు దర్శనం కల్పించేలే తిరుమల తిరుపతి దేవస్థాం ఏర్పాట్లు చేసింది.


పది రోజుల్లో పంచగవ్య ఉత్పత్తులు : నమామి గోవింద బ్రాండ్ పేరుతో పది రోజుల్లో పంచగవ్య ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి తెలిపారు. సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా గోమాత ప్రాశస్త్యాన్ని భక్తులకు తెలియజేసేందుకు పంచగవ్యాలతో పలురకాల గృహావసర ఉత్పత్తులు తయారు చేస్తున్నట్టు ఈవో తెలిపారు