జొహన్నెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరిదైన నాలుగో టెస్టు క్రికెట్ లో 5 లక్షల పరుగులు సాధించి ప్రపంచంలోనే తొలి జట్టుగా రెకార్డుకెక్కింది ఇంగ్లాండ్. టెస్టు మ్యాచ్చులలోనే ఇంగ్లండ్ సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది.. నిన్న శుక్రవారం తొలి రోజు ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ సింగిల్ తీయడం ద్వారా ఇంగ్లండ్ జట్టు 5 లక్షల పరుగులని చేరుకుంది. 

 

కాగా 1022 టెస్టు మ్యాచుల్లో ఇంగ్లాండ్ జట్టు ఈ ఘనత అందుకుంది. కాగా 830 టెస్టులు ఆడిన ఆస్ట్రేలియా 4,32,706 పరుగులతో రెండో స్థానంలో నిలవగా, 540 టెస్టులు ఆడిన భారత్ 2,73,518 పరుగులతో మూడో స్థానంలో నిలిచింది. విండీస్ 545 టెస్టుల్లో 2,70,441 పరుగులు చేసి నాలుగో స్థానంలో ఉంది.

 

పోర్ట్ ఎలిజబెత్‌లోని సెయింట్ జార్జ్‌ పార్క్‌లో జరిగిన మూడో టెస్టుతో ఇంగ్లండ్ మరో రికార్డు సాధించింది. ఈ టెస్టుతో విదేశీ గడ్డపై 500 టెస్టులు ఆడిన ఏకైక జట్టుగా అవతరించింది. విదేశాల్లో 404 టెస్టులు ఆడిన ఆస్ట్రేలియా ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. భారత్  268 టెస్టు మ్యాచ్‌లు ఆడగా 51 మ్యాచుల్లో విజయం సాధించి, 113 మ్యాచుల్లో పరాజయం పాలైంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: