ఎన్నో రోజుల నుంచి అసలుసిసలైన క్రికెట్ ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ప్రేక్షకులను టీవీలకు అతుక్కుపోయేలా చేసి అభిమానులను స్టేడియం కు తరలి వచ్చేలా చేసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగింపు దశకు చేరుకుంది. పది జట్లతో మొదలైన ప్రయాణం ప్లే అఫ్ లో నాలుగు జట్లు స్థానం సంపాదించుకోవడం తో మరింత రసవత్తరంగా మారింది. ప్లే ఆఫ్ లో ఉన్న నాలుగు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరుగుతుంది. ఈ క్రమంలోనే గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన క్వాలిఫైయర్ మ్యాచ్ లో గుజరాత్ విజయఢంకా మోగించింది.


 ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సీజన్లోనే ఫైనల్ లో అడుగుపెట్టిన జట్టుగా రికార్డు సృష్టించింది గుజరాత్ టైటాన్స్. అదే సమయంలో అటు ఓడిన రాజస్థాన్ రాయల్స్ జట్టు క్వాలిఫైర్ రెండు మ్యాచ్ ఆడబోతుంది. ఇకపోతే నేడు ఎలిమినేటర్ మ్యాచ్ జరగబోతోంది. మూడు నాలుగు స్థానాల్లో ఉన్న లక్నో, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలోనే ఇక ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు జట్టు రెండవ క్వాలిఫైయింగ్ మ్యాచ్లో ఆడనుంది. ఓడిపోయిన జట్టు నేరుగా ఇంటి బాట పట్టనుంది. కాగా నేడు సాయంత్రం ఏడున్నర గంటలకు జరగబోయే ఈ మ్యాచ్ గురించి ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు.


 అయితే ఇటీవల విరాట్ కోహ్లీ ఫాంలోకి వచ్చినట్లు కనిపిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు లక్నోతో జరగబోయే మ్యాచ్ లో ఇదే కొనసాగిస్తే బెంగళూరుకు తిరుగుండదు. అదే సమయంలో దినేష్ కార్తీక్ ఫినిషింగ్, హేజిల్ వుడ్, హర్షల్ పటేల్ బౌలింగ్ బెంగళూరు జట్టుకు ప్రధాన బలాలుగా ఉన్నాయి. అదేసమయంలో  కె.ఎల్.రాహుల్ నేతృత్వంలోని లక్నో జట్టు ఓపెనర్లుగా కె.ఎల్.రాహుల్, క్వింటన్ డికాక్ అదరగొడుతున్నారు. ఈ క్రమం లోనే  లక్నో జట్టుకు ఓపెనర్లు ప్రధాన బలంగా ఉన్నారు అని చెప్పాలి. మరి నేడు జరగబోయే మ్యాచ్ లో ఎవరు పైచేయి సాధించి ఫైనల్ వెళ్తారు. ఎవరు పరాజయంతో ఇంటి బాట పడతారు అన్నది చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl