మినీ వరల్డ్ కప్ గా పేరున్న ఆసియా కప్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది అనే విషయం తెలిసిందే. ఇక ఆసియా కప్ ముగుస్తుందో లేదో కాస్త గ్యాప్ లోనే ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ ప్రారంభం కాబోతోంది. అయితే గత ఏడాది టీ20 ప్రపంచకప్ లో భాగంగా టీమిండియా ఘోర మైన ప్రదర్శనతో నిరాశపరిచింది అన్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే ఈసారి మాత్రం జట్టు విషయంలో ఎలాంటి తప్పులు జరగకుండా ఉండేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది టీమ్ ఇండియా యాజమాన్యం.


 ఈ క్రమంలోనే అక్టోబర్ నుంచి ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ లో అత్యుత్తమ జట్టు ను బరిలోకి దింపడమే లక్ష్యంగా గత కొన్ని రోజుల నుండి టీమిండియా యాజమాన్యం ఎన్నో ప్రయోగాలు చేస్తోంది అన్న విషయం తెలిసిందే. అయితే సెప్టెంబర్ మూడో వారంలో ని వరల్డ్ కప్ ఆడబోయే జట్టును ప్రకటించే అవకాశముంది. అయితే ఎవరిని వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియా పంపిస్తారు అనేదానిపై జోరుగానే చర్చలు జరుగుతున్నాయి. మాజీ ఆటగాళ్లందరూ కూడా తమకు తోచిన విధంగా ఏదో ఒకటి చెబుతూనే ఉన్నారు.

 వరల్డ్ కప్ లో ఆడబోయే స్పిన్నర్ల పై మాజీ క్రికెటర్ ప్రస్తుత కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టి20 ప్రపంచ కప్లో టీమ్ ఇండియా తరఫున ఆడబోయే జట్టులో స్పిన్నర్లు కావాలంటే సెలెక్టర్లు వెటరన్ స్పిన్నర్ లు రవీంద్ర జడేజా, అశ్విన్ లతో పాటు అక్షర్ పటేల్ ను తీసుకుంటే ఉపయోగం ఏమీ లేదు అంటూ ఆకాష్ చోప్రా చెప్పుకొచ్చాడు. ఎందుకంటే వారి బౌలింగ్ లో ఎలాంటి వెరిఫికేషన్ ఉండదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. కానీ చాహల్, రవి బిష్ణయ్, కుల్దీప్ యాదవ్ లను తుది జట్టులోకి తీసుకుంటే మాత్రం టీమిండియాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఆకాష్ చోప్రా షాకింగ్ కామెంట్స్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: